ఒకేసారి అమీర్, షారూక్ లకు సుష్మా షాకిచ్చారు

Sushma Shocking Comments On Shahrukh And Aamir

11:10 AM ON 25th August, 2016 By Mirchi Vilas

Sushma Shocking Comments On Shahrukh And Aamir

అవును, విదేశాంగ మంత్ర్రి సుష్మా స్వరాజ్ ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఎలాంటి వారికైనా షాకిచ్చే విషయంలో తనదైన ముద్రవేస్తారు. తాజాగా ఇద్దరు బాలీవుడ్ స్టార్ లకు ఆమె షాకిచ్చారు. వివరాల్లోకి వెళ్తే, అద్దె గర్భం (సరోగసి) విధానాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం సాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాపారాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం సరోగసి చట్టాన్ని తీసుకువస్తోంది.

బుధవారం కేంద్ర కేబినెట్ ఈ బిల్లును కూడా ఆమోదించింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే సరోగసీ కోసం పిల్లలు లేని దంపతులు ఇతర మహిళల గర్భాలను అద్దెకు తీసుకోవడం ఇక నుంచి కుదరదు. తమ బంధువులు లేదా తెలిసిన వారి సహాయం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై సుష్మా మీడియాకు వివరణ ఇస్తూ...ఓ జంట పెళ్లి చేసుకుని కనీసం ఇదేళ్లు కలిసి జీవిస్తే సరోగసి విధానం అనుమతిస్తామన్నారు. అయితే వారికి అప్పటికే సంతానం ఉన్నపక్షంలో సరోగసీపై అనుమతించ బోమని స్పష్టం చేసారు. తాజా బిల్లులో సెలబ్రిటీలకు సైతం ఎలాంటి మినహాయింపు ఉండ బోవని ఆమె పేర్కొన్నారు. ఇది బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ లకు తగిలింది. ఈ ఖాన్ లిద్దరినీ కేంద్రమంత్రి సుష్మా పరోక్షంగా ప్రస్తావిస్తూ చురకలంటించారు.

'ఇద్దరేసి పిల్లలున్నప్పటికీ సెలబ్రిటీలు సరోగసీ ద్వారా మరో బిడ్డను కన్నారు. వాళ్ల భార్యలు పిల్లల్ని గర్భంలో మోసే బాధను పడలేక వేరే మహిళల మీద ఆ భారాన్ని మోపారు' అంటూ సుష్మా పేర్కొన్నారు. షారూక్, అమీర్ లు ఇద్దరేసి సంతానేం ఉన్నా సరోగసి విధానం ద్వారా మరో బిడ్డను పొందారు. మరో హీరో తుషార్ కపూర్ సైతం సరోగసీ విధానంలోనే ఇటీవల బిడ్డను కన్నారు. మొత్తానికి సుష్మా వ్యాఖ్యలకు బాలీవుడ్ ఖాన్ లకు పెద్ద షాకే తగిలింది.

ఇది కూడా చూడండి: చదివింది పదో తరగతి.. కానీ నెలకు 2 లక్షలు సంపాదిస్తుంది

ఇది కూడా చూడండి: మీ శరీరంలో తగినంత నీరు లేదని చెప్పే సూచనలు ఇవే

ఇది కూడా చూడండి: చేతబడి గురించి భయంకర నిజాలు

English summary

External Affairs Minister Sushma Swaraj Shocking Comments On Shahrukh And Aamir.