భారతీయ జంటకు హనీమూన్ ఆనందం పంచిన సుష్మా!

Sushma Swaraj Helps New Couple

10:55 AM ON 10th August, 2016 By Mirchi Vilas

Sushma Swaraj Helps New Couple

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో చురుకుగా ఉండటమే కాదు సమస్యల పట్ల మానవతా దృక్పథంతో స్పందిస్తూ, తనదైన మార్క్ వేశారు. ఆదుకోవాలో ఇప్పుడు మరో రికార్డు సృష్టించారు. ఈమధ్య కాలంలో ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట భారతీయ వరుడు - విదేశీ వధువు వీసా సమస్యను పరిష్కరించిన సుష్మాజీ ఇపుడు భారతీయ జంటకు హనీమూన్ ఆనందాన్ని కూడా పంచారు.

ఓసారి వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీకి చెందిన ఫైజన్ పటేల్ అనే ఓ వ్యక్తికి ఈ మధ్యే పెళ్లయింది. ఇద్దరూ కలిసి హానీమూన్ కు యూరప్ వెళ్లేందుకు డిసైడయ్యారు. కానీ చివరి నిమిషంలో భార్య పాస్ పోర్ట్ ఎక్కడో పోవడంతో ఫైజన్ ఒక్కడే యూరప్ విమానం ఎక్కాడు. అయితే తన భార్యను గుర్తు చేసుకుంటూ విమానంలో తన భార్య ఫొటోను పక్కనపెట్టుకొని దిగిన సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఫైజన్.

అంతేకాదు సుష్మా స్వరాజ్ను కూడా ట్యాగ్ చేశాడు. ఆశ్చర్యకరంగా ఆ ట్వీట్ను చూసిన వెంటనే సుష్మా స్పందించారు. ''మీ భార్యను వెంటనే నన్న కలవమని చెప్పండి.. ఆమె మీతోపాటే హనీమూన్కు వచ్చేలా చేస్తాను'' అని సుష్మా రీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన ఫైజన్కు నోట మాట రాలేదు. తాను చెప్పినట్లే 12 గంటల వ్యవధిలో ఆమెకు సుష్మా ఓ డూప్లికేట్ పాస్ పోర్ట్ కూడా ఇప్పించారు .

ఈ విషయాన్ని మరోసారి ఫైజన్కు ట్వీట్ చేయడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ భార్యభర్తల అనుబంధానికి సుష్మా ఇచ్చిన ప్రాధాన్యానికి పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తంచేస్తూ, సుష్మాజీని మెచ్చుకుంటున్నారు.

English summary

Indian External Affairs Minister Sushma Swaraj helped a newly married couple and reunites them in their honeymoon to Europe.