పాపం, సుత్తివేలు ఉద్యోగం ఎందుకు పోయిందో తెలుసా?

Suthi Velu life history and movies

05:31 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Suthi Velu life history and movies

తెలుగునాట హాస్యబ్రహ్మ జంధ్యాల సృష్టించిన పాత్రలు ఎన్నో. పరిచయం చేసిన నటులు ఎందరో... మాది జంధ్యాల స్కూల్ అని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి నటీనటులకు కల్పించాడు. ఇక జంధ్యాల కలం నుంచి ఎన్నో కొత్త పదాలకు ఆవిష్కరణ అయింది. అందులో ముఖ్యమైన పదం సుత్తి. సబ్జెక్టు లేకుండా ఏదో మాట్లాడాలని అదే పనిగా విసిగిస్తూ, మాట్లాడేవాళ్ళను చూసి వీడు సుత్తి కొట్టేస్తున్నాడు అంటాం. అంతకు ముందు సోది భరించలేకపోతున్నాం అని వాడేవారు. జంధ్యాల సృష్టించిన సుత్తి పదం తర్వాత బాగా వాడుకలోకి వచ్చేసింది. సుత్తి పదమే ఇంటి పేరుగా అయిపోయిన నటులు ఇద్దరు. అందులో సుత్తివేలు ఒకరు కాగా, సుత్తి వీరభద్రరావు మరొకరు.

సుత్తివేలుగా ప్రఖ్యాతి గాంచిన ఈ ప్రముఖ తెలుగు హాస్య నటుడి అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. 1947 ఆగస్టు 7న కృష్ణా జిల్లా భోగిరెడ్డి పల్లిలో జన్మించిన సుత్తివేలు 2012 సెప్టెంబర్ 16న కన్నుమూశాడు. సుమారు 200 చిత్రాలలో నటించారు. అలాగే కొన్ని టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించాడు.

1/7 Pages

నాటకాలంటే ఇష్టం...

ఇంతకీ సుత్తివేలుకు చిన్నప్పటి నుండి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి. 1966లో పి.యు.సి చదివిన అనంతరం, హైదరాబాదుకు చేరుకున్నాడు. అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవాడు. 1967లో ఉద్యోగం మారి బాపట్ల చేరుకున్నాడు. మళ్ళీ ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవాడు.

English summary

Suthi Velu life history and movies. Tollywood one of the top comedian Suthi Velu life history and movies.