ఈ మిఠాయి ఖరీదు కిలో రూ.9వేలు!

Suvarna Mithai kilo cost is 9000

12:18 PM ON 23rd November, 2016 By Mirchi Vilas

Suvarna Mithai kilo cost is 9000

ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో కొన్ని వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. మరికొన్ని తగ్గుతున్నాయి. అలాగే మిఠాయి రేటు కూడా పెరిగిందేమోనని అనుకుంటారేమో కానీ అది కాదు. నిజంగా ఈ మిఠాయి ఖరీదు ఎక్కువే. మాములుగా పండక్కి మిఠాయి కొట్టుకి వెళ్లి ఖరీదైన స్వీటు ఓ కిలో ఇమ్మంటే మహా అయితే ఏ వెయ్యో, పదిహేనొందలో తీసుకుంటాడు. కానీ ముంబయిలోని 'ప్రశాంత్ కార్నర్' అనే స్వీట్ షాప్ కి వెళ్లి అదే మాటంటే కిలో తొమ్మిదివేలు ఖరీదు చేసే 'సువర్ణ మిఠాయి'ని చేతిలో పెడతారు. ప్రపంచంలోనే ఖరీదైన మిఠాయి ఇటీవల అక్కడే తయారైంది. మామూలుగానే ప్రశాంత్ కార్నర్ కు ఖరీదైన స్వీట్లు తయారు చేయడంలో మంచి పేరుంది.

దానికితోడు పండగ రోజులు కావడంతో సువర్ణ మిఠాయి పేరుతో కిలో తొమ్మిది వేలు ఖరీదు చేసే 160కిలోల మిఠాయిని తయారు చేశారు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కొన్ని గంటల వ్యవధిలో మొత్తం అమ్ముడైపోయిందట. యజమాని ప్రశాంత్ కు ఏదో ఒక కొత్త మిఠాయిని ప్రతి పండక్కీ తయారు చేసే అలవాటుండటం, స్థానికంగా వాటికి మంచి పేరు రావడంతో పద్నాలుగున్నర లక్షలు విలువ చేసే ఆ సువర్ణ మిఠాయి ఖాళీ అయిపోయింది.

English summary

Suvarna Mithai kilo cost is 9000