త్వరలో స్వచ్ఛభారత్‌ యాప్‌

Swachh Bharat App To Launch Soon

09:36 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Swachh Bharat App To Launch Soon

దేశంలో పరిశుభ్రతపై అవగాహన పెంచి స్వచ్ఛభారత్ ను ఆవిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం స్వచ్ఛభారత్‌ మిషన్‌. ఈ మిషన్ కోసం త్వరలో మొబైల్‌ యాప్‌ విడుదల కానుంది. ఈ విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించింది. స్వచ్ఛ సిటీ సొల్యూషన్స్ పేరుతో ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. బెంగళూరుకు చెందిన జనాగ్రహ అనే ఎన్జీవో భాగస్వామ్యంతో ఆ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఎన్జీవోతో పట్టణాభివృద్ధిశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ప్రజలు తమ తమ ప్రాంతాల్లోని స్వచ్ఛభారత్‌ పనుల గురించి తెలుసుకోవచ్చు. ఎక్కడన్నా అపరిశుభ్రత కన్పిస్తే ఫిర్యాదులు చేసి, అనంతరం దానిపై ఫీడ్‌బ్యాక్‌ కూడా ఇవ్వొచ్చని ఆ శాఖ జాయింట్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు. అంతేగాక, మున్సిపల్‌ అధికారులు సైతం ఆ ప్రాంతంలోని అపరిశుభ్రతపై వివరాలను తెలుసుకుని.. తగిన చర్యలు చేపట్టేందుకు వీలవుతుందన్నారు. 2019లోగా పరిశుభ్ర భారత్‌ నిర్మాణానికి ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

English summary

The Urban Development Ministry to launch a mobile app for citizens to post their complaints about garbage pile-up in their areas.'Swachh City Solutions', the proposed mobile and Web-based application will be developed in partnership with Bengaluru-based NGO to ensure timely and effective implementation of the Swachh Bharat Mission in India