రాహుల్ పై డాక్టర్ స్వామి సంచలన వ్యాఖ్యలు

Swamy Free Advice to Rahul Gandhi

10:52 AM ON 27th August, 2016 By Mirchi Vilas

Swamy Free Advice to Rahul Gandhi

ఎవరి మీదైనా గురిపెడితే అంతుచూసేదాకా వదలని ఓ వ్యక్తి వున్నాడు తెలుసా? ఆయనెవరో కాదు బిజెపి నేత , రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ... ఈయన్ని రాజకీయ చాణక్యుడు అనండి... వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తి అనండి ... ఏది ఏమైనా ఈయన బాణం సంధిస్తే, గురి తప్పదు. తమిళనాట జయలలిత కావచ్చు మరెవరైనా కావచ్చు, ఈ తమిళ తంబీ దెబ్బకు తట్టుకోలేరు. అందుకే ఈయన జోలికి ఎవరూ వెళ్ళడానికి చాలామంది జంకుతారు. కోర్టు మెట్లు ఎక్కించి, ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు.

ఇంతకీ అసలు విషయానికి వస్తే, డాక్టర్ స్వామి ఈమధ్య తరచూ రాహుల్ మీద గురిపెడ్తున్నారు. అసలే నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో తల్లీ కొడుకులను కోర్టు మెట్లు ఎక్కించిన డాక్టర్ స్వామి, ఇప్పుడు రాహుల్ తీరుపై చురకలు అంటించారు. అది ఎందుకంటారా? ఆర్ ఎస్ ఎస్ విషయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సదరు ఆర్ ఎస్ ఎస్ నేతలు కోర్టుకి వెళ్లడంతో కోర్టు గట్టిగానే స్పందించింది. క్షమాపణ అయినా చెప్పాలి, కేసు అయినా ఎదుర్కోవాలి అని చెప్పడంతో రాహూల్ యు టర్న్ తీసుకున్నారు. తాను ఆర్ ఎస్ ఎస్ ను ఏమీ అనలేదని.. ఆ సంస్థకు చెందిన కొందరి మీదనే తాను విమర్శలు చేశానని వ్యాఖ్యానించారు. దీన్ని సంఘ్ వర్గాలు యూటర్న్ గా అభివర్ణిస్తే.. కాంగ్రెస్ నేతలు అందుకు భిన్నంగా స్పందించారు.

ఆ ఇస్యూ పక్కన పెడితే, తాజాగా ఈ అంశంపై రాహుల్ ట్విట్టర్ లో ' ఆర్ ఎస్ ఎస్ విధానాలకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుంది’’ అంటూ ట్వీట్ చేయటంపై సంఘ్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశంపై డాక్టర్ స్వామి గళం విప్పారు. సంఘ్ మీద రాహుల్ చేసినట్లుగా చెబుతున్న తాజా ట్వీట్ నిజానికి ఆయన అలా చేసి ఉండరని.. ఆయన ఆఫీసులో మరెవరో చేసి ఉంటారని డాక్టర్ స్వామి ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం తాను రాహుల్ గాంధీకి ఒక సలహా ఇవ్వాలని భావిస్తున్నానని డాక్టర్ స్వామి పేర్కొంటూ, రాహుల్ రాజకీయాల నుంచి వైదొలగాలని, ఆయనకు రాజకీయ భవిష్యత్ లేదని ఘాటుగా మండిపడ్డారు. జాతీయప్రాధాన్యత ఉన్న అంశాల మీద రాహుల్ తరచూ యూటర్న్ తీసుకోవటం ఎక్కువైంది. కనీసం రాహుల్ రాజకీయ నిష్క్రమణతో అతి పురాతనమైన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెంచినట్లు అవుతారు' అంటూ డాక్టర్ స్వామి తనదైన శైలిలో చురక అంటించారు. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.

ఇది కూడా చూడండి: టాలీవుడ్ లో వీళ్ళు వీళ్ళు రిలేటివ్స్ అని మీకు తెలుసా

ఇది కూడా చూడండి: పుట్టుమచ్చల బట్టి మీ మనస్తత్వం

ఇది కూడా చూడండి: మన హీరోలు - హైక్లాస్ ఇళ్ళు

English summary

Subramanian Swamy Free shocking Advice to Rahul Gandhi.