'స్వామి రారా' సీక్వెల్ ఒకే

Swamy Rara Movie Sequel

10:30 AM ON 28th July, 2016 By Mirchi Vilas

Swamy Rara Movie Sequel

చాలా సినిమాలకు కొనసాగింపు అదేనండీ సీక్వెల్ సినిమాలు వచ్చేస్తున్న కాలం ఇది. ఇప్పుడు అదే తరహాలో మరో సినిమా వచ్చేస్తోంది. ఇంతకీ అది ఏమిటని అనుకుంటున్నారా? హ్యాపీడేస్ తో టాలీవుడ్ కి పరిచయమైన నిఖిల్ సినిమా కెరీర్ గురించి చెప్పాలంటే 'స్వామి రారా' కి ముందు - తరువాత అని చెప్పొచ్చు. యూత్ కి బాగా కనెక్ట్ అయి ఊహించని హిట్ కొట్టిన ఆ సినిమాతో నిఖిల్ కి తెలుగులో ఓ మార్కెట్ అంటూ క్రియేట్ అయింది. అలాగే దర్శకుడు సుధీర్ వర్మకి ఈ సినిమా నాగార్జున పిలిచి మరీ అవకాశం ఇచ్చేలా చేసింది.

అలాంటి 'స్వామి రారా ' కి సీక్వెల్ త్వరరోనే సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా గా వినిపిస్తున్న టాక్. ఈ సీక్వెల్ నిర్మించడానికి అభిషేక్ పిక్చర్స్ ఓకే చెప్పడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు చక చకా జరిగిపోతున్నాయని కూడా అంటున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట.నిఖిల్, సుధీర్ వర్మల కలయికతో రాబోయే 'స్వామి రారా' సీక్వెల్ వాళ్ళ కెరీని ఎటు మళ్లిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: చేసింది చాలు ఇక ఆపేయ్.. సమంతపై నాగ్ సీరియస్!

ఇవి కూడా చదవండి:ఫోన్ లాక్ మర్చిపోయారా.! అయితే ఇలా ఓపెన్ చెయ్యండి

English summary

Young Hero Nikhil has got good commercial hit with the movie "Swamy Rara" which was directed by Young director Sudheer Varma and now these two were plannig to make sequel of this movie.