తిరుమల - సింహాచలం కొండలను తవ్వండి చూద్దాం 

Swamy Swaroopananda Fires On ChandraBabu

05:52 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Swamy Swaroopananda Fires On ChandraBabu

ఎపి సిఎమ్ చంద్రబాబుపై విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి కోపమొచ్చింది. అదికూడా విశాఖ మన్యం లో బాక్సైట్ తవ్వకాల అంశం మీదే. అందుకే స్వామీజీ 'మన్యంలో కాదు దమ్ముంటే తిరుమల కొండను - సింహాచలం కొండను తవ్వాలి' అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆ కొండలను తవ్వితే భక్తులు ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విశాఖ మన్యంలో మంచంగిపుట్టు - పెద్ద బయలు ప్రాంతాల్లోని బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదిత ప్రాంతాల్లో పర్యటించి, ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పర్యటించి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు. అక్కడి గిరిజనులకు దుప్పట్లు - చీరలు పంచిపెట్టారు.

ఆదివాసీల అమాయకత్వాన్ని అడ్డంపెట్టుకుని ప్రభుత్వం వారి సంపదను దోచుకునే ప్రయత్నం చేస్తోందని స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొంటూ, రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తామంటే చెల్లద న్నారు. మన్యంలోని కొండలపై శ్రీరాముడు - శ్రీకృష్ణుడు నడయాడారని... అలాంటి పవిత్రమైన కొండలను తవ్వితే ఊరుకునేది లేదన్నారు. ప్రతి ఆదివాసీ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని, విదేశీ మూకలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మరి చంద్రబాబు పై ఆయనకు అంత కోపం ఎందుకొచ్చిందో ఏమో నని పలువురు గుసగుస లాడుకుంటున్నారు.

English summary

Sarada Peetadhipathi Sri Swaroopananda Saraswati Fires On Andhra Pradesh Cheif Minister Chandra Babu On Bauxite Mining issue in Vishaka Agency