బాబు దౌర్భాగ్య పాలన: స్వరూపానంద సరస్వతి ఫైర్

Swaroopanand Saraswati fires on Chandrababu

12:01 PM ON 29th November, 2016 By Mirchi Vilas

Swaroopanand Saraswati fires on Chandrababu

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో చంద్రబాబు సర్కార్ ఏర్పడ్డాక, ఏమైందో ఏమో గానీ బాబు గారి పేరు వినిపిస్తే చాలు, విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పుడుమరోసారి ఏపీ ప్రభుత్వం - చంద్రబాబుపై నేరుగా నిప్పులు కురిపించారు. చంద్రబాబుది దౌర్భాగ్యపు పరిపాలన అంటూ ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన చంద్రబాబు ప్రభుత్వం ఏపీ దేవాదాయ శాఖపై నిప్పులు చెరిగారు.

1/3 Pages

సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన ఏపీ దేవాదాయ శాఖ ఏమాత్రం బుద్ది లేకుండా పనిచేస్తోందని అన్నారు. ఆచారాలు సంప్రదాయాలకు పాతరేసి దేవాలయాలకు చెందిన కోట్లాది రూపాయలను పుష్కరాల పేరుతో వృథాగా ఖర్చు చేసిందని విమర్శించారు.

English summary

Swaroopanand Saraswati fires on Chandrababu