స్వాతి కేసు వీక్ అవుతోందా

Swathi and Ramkumar selfie leaked

11:41 AM ON 8th July, 2016 By Mirchi Vilas

Swathi and Ramkumar selfie leaked

కొన్ని కేసులు చూస్తుంటే, ఎలా వీగిపోవాలో స్కెచ్ వేస్తారు. సరిగా ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి హత్యకేసులో రోజుకో వార్త వెలుగులోకి రావడం కూడా ఇదే అనుమానం రేకెత్తిస్తోంది. లేటెస్ట్ గా హత్యకు గురైన స్వాతి- నిందితుడు రామ్ కుమార్ తో కలిసున్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫేస్ బుక్ , వాట్సాప్ లో ఎక్కడ చూసినా ఆ ఫోటో హంగామా చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఫోటోని ఎవరో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారంటూ పరుశురామ్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చాడు. కనిపించిన ఫోటోలో ఉన్నది స్వాతి-రామ్ కుమార్ కాదని, తన కొడుకు ప్రదీప్ , అతడి స్నేహితురాలితో కలసి పుదుచ్చేరిలో తీసుకున్న ఫోటోగా చెబుతున్నాడు. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారని, కూతురుని పోగొట్టుకున్న దుఃఖంలోవున్న ఆమె తల్లిదండ్రులకు ఇలాంటివి మరింత బాధిస్తాయని అంటున్నాడు. దయచేసి ఇలాంటి వార్తలు ప్రసారం చేయవద్దని వేడుకుంటున్నాడు. అంటే తెరవెనుక ఈ కేసు వీగిపోడానికి స్కెచ్ వేస్తున్నారా అనే అనుమానం బలపడుతోంది. మొత్తానికి ఈ వ్యవహారం ఎటు చేరుతుందో చూడాలి.

ఇది కూడా చూడండి: చాణుక్యుడు ఆత్మహత్య చేసుకున్నాడా ?

ఇది కూడా చూడండి: ఇంట్లో ఉంచకూడని 8 పెయింటింగ్స్

ఇది కూడా చూడండి: ఇలాంటి అమ్మాయిలని అబ్బాయిలు పెళ్లి చేసుకోరట

English summary

Swathi and Ramkumar selfie leaked and halchal in Watsapp.