స్వాతి హంతకుడు దొరికేసాడు

Swathi murderer caught to police

01:10 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

Swathi murderer caught to police

ఎట్టకేలకు హంతకుడు దొరికేసాడు. అదేనండీ చెన్నయ్ లో కిక్కిరిసిన నుంగంబాకం రైల్వేస్టేషనులో ప్రయాణికుల మధ్యనే ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని హతమార్చిన కేసులో నింధితుడిని పోలీసులు పట్టేశారు. వాస్తవానికి నింధితుడిని సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు పట్టిచ్చింది. అందరూ చూస్తుండగానే దారుణంగా హతమార్చి దర్జాగా వెళ్లిన నింధితుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేసిన సంగతి తెల్సిందే. బ్లూ చెక్ షర్టు ధరించి, భుజాన బ్యాగ్ తగిలించుకొని వెళుతున్న యువకుడే స్వాతి హంతకుడని పోలీసులు విడుదల చేసిన సీసీ టీవీ ఫుటేజ్ ను చెన్నయ్ లో ఇంటింటికి ప్రచారం చేశారు.

దీంతో 22 ఏళ్ల రామ్ కుమార్ చెన్నయ్ కు 650 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను చూసిన రామ్ కుమార్ బ్లేడుతో మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో పోలీసులు అతన్ని పట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రామ్ కుమార్ గత మూడు నెలలుగా మరో యువకుడితో కలిసి షేరింగ్లో రూమ్ లో ఉంటున్నాడని పోలీసుల విచారణలో తేలింది. రామ్ కుమార్ నివాసముంటున్న గదిలో స్వాతిని హతమార్చినపుడు ధరించిన బ్లూ చెక్స్ షర్టును స్వాధీనం చేసుకున్నారు.

తిరునెల్వేలిలో రామ్ కుమార్ కు తల్లితండ్రులు, సోదరుడు, సోదరిలున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు రామ్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు. కాగా రామ్ కుమార్ ను తాము ఎన్నడూ చూడలేదని స్వాతి తల్లిదండ్రులు అంటున్నారు. అసలు ఎందుకు చంపాడు, చంపడానికి దారితీసిన కారణాలు వెలుగు చూడాల్సి ఉంది. అప్పుడు గానీ ఈ కేసు చిక్కు ముడి వీడదు.

English summary

Swathi murderer caught to police