స్వాతి మర్డర్ కేసులో మరో మిస్టరీ.. నింధితుడు సూసైడ్!

Swathi murderer Ram Kumar get suicide in jail

12:57 PM ON 19th September, 2016 By Mirchi Vilas

Swathi murderer Ram Kumar get suicide in jail

ఈ మధ్య తమిళనాడులో సంచలనం సృష్టించిన చెన్నై ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ స్వాతి హత్య కేసు తెలుసు కదా. కేవలం 20 నిమిషాలలోపు ఆమెను కిరాతకంగా హత్యచేసి, చడీ చప్పుడు లేకుండా పరారవ్వడం, ఆ తర్వాత పోలీసులకు దొరకడం తెల్సిందే. ఇక నింధితుడు రామ్ కుమార్ ఆదివారం నాడు జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అది ఆత్మహత్య కాదని హత్య చేసారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటూ పుజల్ జైలులో ఉన్న రామ్ కుమార్ జైల్లోని విద్యుత్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసున్నట్టు జైలు సిబ్బంది చెబుతున్నారు. రామ్ కుమార్ ను హుటాహుటిన రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అతను మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

ఈ విషయాన్ని స్వాతి హత్య కేసుపై దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారి శంకర్ ధ్రువీకరించారు. కాగా, రామ్ కుమార్ లాయర్ రామరాజన్ మాత్రం జైల్లోనే రామ్ కుమార్ ను హత్య చేసినట్టు ఆరోపించారు. ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. జూలై 24న నుంగంబాక్కం రైల్వే స్టేషన్ లో స్వాతిని నరికి చంపాడనే అభియోగంపై రామ్ కుమార్ ను జూలై 1న తిరునల్వేలి జిల్లాలోని మీనాక్షిపురంలోని అతని ఇంట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెల్సిందే. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య చేయించారా అన్నది మరో మిస్టరీ.

ఇది కూడా చదవండి: బ్రెస్ట్ సర్జరీలతో హాట్ లుక్ సంపాదించుకున్న హీరోయిన్స్!

ఇది కూడా చదవండి: మీకు 25 ఏళ్ళు వచ్చేలోపు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 25 నిజాలు!

ఇది కూడా చదవండి: ఈ ఆహార పదార్ధాలు కలిపి తింటే మీ ప్రాణాలకే ప్రమాదం!

English summary

Swathi murderer Ram Kumar get suicide in jail. Software Engineer Swathi who murdered by Ram Kumar is gets suicide in jail. He touches the current wire and gets shocked. Then after he died when was on the way to hospital.