నగ్నంగా చెలరేగిన స్వాతీ నాయుడు

Swathi Naidu acts without clothes in Campus Ampasayya movie

12:29 PM ON 26th July, 2016 By Mirchi Vilas

Swathi Naidu acts without clothes in Campus Ampasayya movie

ఇప్పుడు ట్రెండ్ మారింది కదా. లేకపోతే ఇదివరకు నగ్నంగా నటించాలంటే నటీమణులు కొట్టినంత పని చేసేవారు. కానీ ఇప్పుడు ఒకే అంటున్నారు. వాస్తవిక కథ కోసం అవసరమైతే తమ శరీరంపై నూలుపోగు లేకుండా నటించేందుకు సై అంటున్నారు. నటి స్వాతీ నాయుడు కూడా ఇప్పుడు అలాగే చేసేసింది. 'అంపశయ్య' నవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1969లో నవీన్ రాసిన ఈ నవల ఆయన ఇంటి పేరైపోయింది. ఇప్పుడీ నవల ఆధారంగా ప్రభాకర్ జైని తీసిన 'క్యాంపస్-అంపశయ్య' చిత్రం విడుదలకు సిద్ధమైంది. అమ్మా నీకు వందనం, ప్రణయ వీధుల్లో చిత్రాల ద్వారా తనలో డిఫరెంట్ ఫిలిం మేకర్ ఉన్న విషయాన్ని ప్రభాకర్ జైని నిరూపించుకున్నారు.

1/4 Pages

'క్యాంపస్-అంపశయ్య' చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఆయన ఓ ప్రధాన పాత్ర కూడా చేశారు. శ్యామ్ కుమార్, పావని హీరోహీరోయిన్లుగా నటించారు. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఆకెళ్ల రాఘవేంద్ర, స్వాతీ నాయుడు, మొగిలయ్య, యోగి దివాన్, వాల్మీకి, మోనికా థాంప్సన్ తదితరులు నటించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖారున విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు.

English summary

Swathi Naidu acts without clothes in Campus Ampasayya movie