నా కూతురిని 'హాట్' అంటారా.. అమితాబ్ కుమార్తె రచ్చరచ్చ..

Swetha Bacchan fires on media about Navya Naveli

12:07 PM ON 13th October, 2016 By Mirchi Vilas

Swetha Bacchan fires on media about Navya Naveli

బాలీవుడ్ టాలీవుడు కోలీవుడ్ అనే తేడా లేకుండా సినిమా హీరోలు, హీరోయిన్లు కుమారులు, కుమార్తెలు తప్పతాగి, స్నేహితులతో రోడ్లపై హల్ చల్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇక స్టార్ల కుమార్తెలయితే బాయ్ ఫ్రెండ్స్ తో పబ్లిక్ లో విచ్చలవిడిగా ప్రవర్తించడమే కాకుండా, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెడుతూ, నానా హంగామా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలి కాలంలో శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్, అమితాబ్ మనువరాలు నవ్య నవేలి, షారూక్ ఖాన్ ఆర్యన్ ఖాన్ ల వ్యవహారం మనందరికీ తెలిసిందే. వీళ్లంతా అత్యంత సన్నిహితంగా ఉంటూ, ముద్దులు పెట్టుకుంటూ తిరిగి, ఆ ఫోటోలను ఫేస్ బుక్, ట్విట్టర్లలో పోస్ట్ చేయడం, మీడియాలో రచ్చరచ్చ జరగడం తెలిసిందే.

ఈ వ్యవహారంపై అమితాబ్ తన పెద్దరికాన్ని చాటుతూ తన మనువరాళ్లకు ఒక ఉత్తరం కూడా రాశారు. తాజాగా అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ మాత్రం తన కుమార్తె నవ్య నవేలి నందాను సమర్థిస్తూ మీడియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మరో ఉత్తరం రాయడం సంచలనం సృష్టించింది.

1/4 Pages

తన కుమార్తెను 'హాట్', 'వైల్డ్' అంటూ సంబోధించడం మీడియాకు ఏ మాత్రం తగదని హెచ్చరించింది. తన కుమార్తె ఫోటోలను తస్కరించి వార్తలు రాయడం న్యాయమా అని సూటిగా ప్రశ్నించింది. నా కుమార్తె టీనేజ్ లో ఉంది. ఈ వయసులో అందరూ అమ్మాయిలు ఎలా ప్రవర్తిస్తారో నా కుమార్తె అలాగే ప్రవర్తించింది.

English summary

Swetha Bacchan fires on media about Navya Naveli