స్విఫ్ట్ కీ నుంచి సింబల్స్ యాప్

Swift key symbols app released by swift key company

03:58 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Swift key symbols app released by swift key company

మాట్లాడలేని, చదవలేని వారి కోసం స్విఫ్ట్ కీ కొత్త యాప్ ను విడుదల చేసింది. స్విఫ్ట్ కీ సింబల్స్ పేరుతో రిలీజ్ చేసిన ఈ యాప్ మాట్లాడలేని వారికి ఎక్కువగా ఉపయోగపడుతుందని కంపెనీ చెపుతోంది. అండ్రాయిడ్ పై పని చేసే ఈ యాప్ ప్రస్తుతం ప్లే స్లోర్ లో అందుబాటులో ఉంది. మాట్లాడలేని, చదవలేని ప్రజలు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సులభంగా కమ్యూనికేట్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని కంపెనీ తన బ్లాగ్ లో పేర్కొంది. స్విఫ్ట్ సింబల్స్ లో ఉన్న సింబల్స్ ను ఎంచుకోవడం ద్వారా యూజర్లు తాము చెప్పాలనుకున్న మాటలను గుర్తించవచ్చు. ఈ యాప్ కు యూజర్లు అవసరమైతే తమ సొంత ఇమేజ్లు, కేటగిరీలను యాడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

English summary

Swift key released its new swift key symbols app for who cannot talk and chat. Company says that this app is presently available for only android users