స్వైప్‌ నుంచి వర్చ్యూ స్మార్ట్‌ఫోన్‌

Swipe Launched Virtue Smart Phone

09:58 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

Swipe Launched Virtue Smart Phone

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ స్వైప్‌ టెక్నాలజీస్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. స్వైప్‌ వర్చ్యూ పేరిట ఈఫోన్ ను ఈరోజు భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ధర రూ.5,999గా కంపెనీ ప్రకటించింది. ఇది కేవలం తెలుపు రంగులోనే లభ్యమౌతుందని.. అది కూడా ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ ద్వారా మాత్రమే అమ్మకాలు చేపడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

స్వైప్‌ వర్చ్యూ ఫోన్‌ ఫీచర్లు ఇవే..

5 అంగుళాల తాకే తెర, 1.3గిగా హెడ్జ్‌ ప్రాసెసర్‌, 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 8మెగాపిక్సెల్‌ రేర్‌ కెమేరా, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 16జీబీ స్టోరేజీ సామర్థ్యం, 2జీబీ ర్యామ్‌

English summary

Popular Mobile phone company Swipe launched a new smartphone called "VIRTUE in Indian Market. The price of this smartphone was 5,999