స్వైప్ నుంచి ఫిట్‌నెస్ ట్రాకర్

Swipe Launches F-Band Fitness Tracker

07:02 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Swipe Launches F-Band Fitness Tracker

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ స్వైప్ టెక్నాలజీస్ ఎఫ్ బ్యాండ్ పేరిట ఓ నూతన ఫిట్‌నెస్ ట్రాకర్‌ను మార్కెట్‌లో తెచ్చింది. దీని ధరను రూ.1,499గా నిర్ణయించింది. ఈ ట్రాకర్ జనవరి 7 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. దీని ద్వారా యూజర్ నిత్యం తాను నడిచే స్టెప్స్‌ను కౌంట్ చేసుకోవచ్చు. అలాగే ఈ డివైస్ యూజర్ రోజువారీ యాక్టివిటీని ట్రాక్ చేస్తుంది. ఒక రోజులో యూజర్ ఎన్ని క్యాలరీలను కరిగించాడో తెలుసుకోవచ్చు. ఈ డివైస్‌లో 55ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఒకసారి చార్జింగ్ పెడితే దాదాపు 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. దీన్ని బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.

English summary

Swipe Technologies launches F-Band Fitness Tracker .It is priced at Rs. 1,499, and will be available to purchase from January 7.