పెద్ద నోట్ల రద్దుతో కూరగాయల కొట్టులో స్వైపింగ్ మషీన్!

Swiping machine in vegetables shop

12:26 PM ON 17th November, 2016 By Mirchi Vilas

Swiping machine in vegetables shop

ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్లపై ఉక్కుపాదం మోపడంతో వ్యాపారస్తులకు పిడిగుద్దులా మారింది. వినియోగదారుల దగ్గర రూ.100, 50.. ఇలా చిన్న నోట్లు లేక, పెద్ద నోట్లకు చిల్లరదొరక్క నిత్యావరసరవస్తువులు సైతం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో వ్యాపారస్తులు ఈగలు తోలుకుంటూ ఉసూరుమని షాపుల్లో కూర్చోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇది ఇంకెన్నాళ్లన్నట్టు చిన్నా చితకా వ్యాపారాలు కొత్త రూట్లు వెతుక్కుంటున్నారు. తాము కూడా మారాలి అన్నట్టుగా కొత్త ఒరవడి అందిపుచ్చుకున్నారు. ఇందులో భాగంగా ప్రతీ చిన్నషాపులో కూడా స్వైపింగ్ మెషీన్లు పెట్టుకుని ఇచ్చట అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులు అనుమతించబడును(ఆల్ కార్డ్స్ ఆర్ యాక్సెప్టెడ్ హియర్) అంటూ బోర్డులు తగిలించుకుని రంగంలోకి దిగుతున్నారు.

ఓ కూరగాయల దుకాణదారు ఇలా సరికొత్త ప్రకటన పెట్టుకుని వ్యాపారం సాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. రానురాను ఇది మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చి ప్రతీ చిన్న వ్యాపారదారుడూ కార్డ్ స్వైపింగ్ సౌకర్యం కల్పించే అవకాశం కనిపిస్తోంది. సో.. పేపర్ లెస్ కరెన్సీ మరింత పాపులర్ అయ్యే ఛాన్స్ ఉందంటూ టాక్ ఊపందుకుంది.

English summary

Swiping machine in vegetables shop