ఓ సారి లైట్ ఆఫ్ చేసి చూడండి..

Switch Off The Lights To Increase WiFi Speed

04:13 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Switch Off The Lights To Increase WiFi Speed

ఆన్ లైన్ లో బిజీ.. బిజీగా పని చేస్తుంటాం.. ఒక్కసారి నెట్ స్లో అయిపోతుంది. ఏంటా అని చూస్తే వైఫై సిగ్నల్స్ తక్కువగా ఉంటాయి. ఇంత ఖర్చు చేసి వైఫై పెట్టించినా.. సిగ్నల్ బాధ తప్పడం లేదని తల పట్టుకుంటాం. తరచు మనలో చాలా మంది ఎదుర్కొనే ఇబ్బందే ఇదీ. అయితే దీని నుంచి తప్పించుకోవడానికి ఓ కిటుకు ఉందట. అదే

లైట్ ఆఫ్ చేసి చూడటం. లైట్ ఆఫ్ చేస్తే అంతా చీకటే కదా.. అని అనుకోకండి. ఆ చీకటి కొన్ని సార్లు లాభం కూడా చేకూరుస్తుంది. వైఫై స్పీడ్ పెరిగేలా చేస్తుంది.

సాధారణంగా ఇళ్లలో వాడే లైట్లు వైఫై సిగ్నల్‌ను తగ్గిస్తాయి. లైట్లను ఆన్ చేసినప్పుడు కిరణాల ఇంటర్‌ఫియరెన్స్ వల్ల ఇది జరుగుతుందని బ్రిటన్ కమ్యూనికేషన్ సంస్థ ఆఫ్‌కామ్ ఈ విషయాన్ని వెల్లడించింది. రానున్న క్రిస్మస్ వేడుకలకు పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలతో అలంకరించడం వల్ల అక్కడ ఉండే వైఫై సిగ్నల్ బాగా తగ్గొచ్చని కూడా తెలిపింది. కేవలం లైట్లే కాకుండా మైక్రో ఒవెన్, బ్లూటూత్ పరికరాలు, మానిటర్లు కూడా వైఫై సిగ్నల్స్‌ను తగ్గిస్తాయని చెబుతోంది. అందుకే వైఫై రూటర్ ఉన్న రూమ్‌లో ఒక్కసారి లైట్ ఆఫ్ చేసి చూడండి. వైఫై సిగ్నల్స్ పెరగొచ్చు

English summary

When Wifi slows down suddenly when using internet then there is small solution to increase wifi singnal speed. The solution is that just switch off the lights. Lights slows down the wifi signal