సిడ్నీ థండర్స్‌ దే బిగ్‌బాష్‌

Sydney Thunders Won Big Bash 2016 Title

12:57 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Sydney Thunders Won Big Bash 2016 Title

బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌ జయకేతనం ఎగురవేసింది. మెల్‌బోర్న్‌ స్టార్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్‌లో సిడ్నీ థండర్స్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. టాస్‌ గెలిచిన సిడ్నీ థండర్స్‌ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌.. కెవిన్‌ పీటర్సన్‌ (74: 39 బంతుల్లో 4×4, 5×4) చెలరేగి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడిన సిడ్నీ థండర్స్‌ ఓపెనర్లు ఉస్మాన్‌ ఖ్వాజా (70: 40 బంతుల్లో 5×4, 3×6), కలిస్‌ (28: 27 బంతుల్లో 4×4) తొలి వికెట్‌కు 86 పరుగులు జత చేసి జట్టుకు శుభారంభమిచ్చారు. అయితే వీరి ఔట్‌ అనంతరం తడబడిన సిడ్నీ జట్టు ఒకానొక దశలో 146/5 (16.3 ఓవర్లు)తో నిలిచి ఇబ్బందుల్లో పడినట్లు కనిపించింది. అయితే బిజార్డ్‌ (16), రోహర్‌ (13 నాటౌట్‌) చివర్లో నిలకడగా ఆడటంతో సిడ్నీ థండర్స్‌ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది.

English summary

Sydney Thunders team Won Big Bash 2016 Title. Sydney thunders played with Melbourne Stars in the final. Usman Khawaja hits 70 runs in the final and helped Sydney thunders team to win 2016 title