ఇలా ప్రవర్తిస్తున్నారంటే వారు ఆత్మహత్యకు సిద్ధమయినట్లే!

Symptoms of people to get suicide

04:45 PM ON 10th September, 2016 By Mirchi Vilas

Symptoms of people to get suicide

లవ్ లో ఫెయిల్ అయినా, అమ్మ తిట్టినా, నాన్న కొట్టినా, మార్కులు రాకపోయినా, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా, సినిమా టికెట్ దొరక్కపోయినా, ఉద్యోగం రాకపోయినా, కోరుకున్నది దక్కకపోయినా బతుకు భారమనిపిస్తుంది. దాంతో ఆత్మహత్యకు సిద్ధమవుతున్నారు. కానీ కొద్ది క్షణాలు నిలకడగా, నిబ్బరంతో ఆలోచించగలిగితే...? బతుకుమీద ఆశ పుడుతుంది. పునరుజ్జీవన కోరిక మొలకెత్తుతుంది. ఇలా మృత్యుకోరల్లోంచి బైటపడినవారెందరో ఉన్నత స్థానాలనధిరోహించారు! అందుకే బలవన్మరణాన్ని చావుదెబ్బతీద్దాం, బతుకు బావుటా ఎగరేద్దాం అంటున్నారు సామాజికవేత్తలు, సైకాలజిస్టులు.

ప్రపంచంలో సగటున రెండు నిమిషాలకొకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వలలో చిక్కిన చేపపిల్ల చివరినిమిషం దాకా బతికేయత్నమే చేస్తుంది. పిల్లాడికి చిక్కిన రెక్కల తూనీగ ఎగిరి తప్పించుకోవాలనే చూస్తుంది. సృష్టిలో ప్రతి ప్రాణికీ బతకాలనే తాపత్రయమే! కానీ మనిషికే విపరీత బుద్ధి! చిన్న సమస్యలకూ చావే పరిష్కారమనే ధోరణి పెరిగిందని అనేక సర్వేలు చెబుతున్నాయి.

1/7 Pages

డిప్రెసివ్ డిజార్డర్..


ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మానసిక నిరాశే దీనికి కారణమంటున్నారు సైకాలజిస్టులు. మెదడులో కొన్ని రసాయన మార్పులవల్ల ఒత్తిడికి గురవుతుంటారు. ఇదే డిప్రెసివ్ డిజార్డర్ కు దారితీస్తుంది. ఒకసారి ఈ స్థితికి చేరితే చిన్న పనిపట్ల కూడా తీవ్ర విముఖత, ఆత్మన్యూనత భావం, ఏ పనికీ న్యాయం చేయలేకపోతున్నామన్న ఆందోళన కలుగుతుంది. ప్రతీదీ భూతద్దంలో కనిపిస్తుంది. తనకెవరూ లేరు, ఉండీ ప్రయోజనం లేదనే తీవ్ర నిరాశలో కుంగిపోతారు.

English summary

Symptoms of people to get suicide