సిరియా చేతికి 'పాల్మైరా'

Syria Holds Back Palmyra

01:32 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Syria Holds Back Palmyra

అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ పాల్మైరా నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. రష్యా దళాల సహాయంతో సిరియా సైన్యం ఐసిస్‌ మీద విజయం నమోదు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, .... సిరియాలో ప్రముఖ పురాతన నగరంగా పేరొందిన పాల్మైరాను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. అయితే ఈ నగరాన్ని గత ఏడాది మేలో ఐసిస్‌ స్వాధీనం చేసుకుని పలు వారసత్వ కట్టడాలను ధ్వంసం చేసింది. ఎలాగైనా ఈ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని గత కొద్దిరోజులుగా యుద్ధం సాగుతోంది. సిరియా తరఫున 188 మంది రక్షణ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఐసిన్‌ 400 మందిని కోల్పోయింది. ఎట్టకేలకు ఈ నగరాన్ని దక్కించుకున్న సిరియా ప్రస్తుతం పాల్మైరా నగరంలో పలు ప్రాంతాల్లో ఐసిస్‌ అమర్చిన బాంబులను, మందుపాతరలను నిర్వీర్యం చేసే పనిలో వుంది. సిరియా సైన్యం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. వారసత్వ కట్టడాలున్న ప్రాంతంతో పాటు పౌర నివాస ప్రాంతం కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చిందని సిరియా తెలిపింది. కాగా ఐసిస్‌ ఆధ్వర్యంలో ఉన్న మరో నగరం మోసూల్‌ని కూడా త్వరలో స్వాధీనం చేసుకోవడానికి యుద్ధం ప్రారంభించినట్లు ఇరాక్‌ సైన్యం గత గురువారం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

'సర్దార్ ' లో దాగున్న రహస్యాలు

18వ ఏట నుంచి తల్లిని అవ్వాలనుకున్నా..

ఊపిరి పై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్

కోహ్లీకి పూనమ్ హాట్ గిఫ్ట్

ధోనీని బూతులు తిడుతున్న యువరాజ్ తండ్రి

English summary

Syrian Army was fighting with ISS Terrorists to take back its Oldest City Palmyra from ISS Terrorists. Syria Government had announced that it had Hold back the Palmyra City from ISS.