ఈ టీష‌ర్ట్ ఉంటే ప్రపంచ భాషలన్నీ వచ్చేస్తాయ్

T Shirt With 40 Icons Lets You Communicate In Any Country

04:22 PM ON 25th May, 2016 By Mirchi Vilas

T Shirt With 40 Icons Lets You Communicate In Any Country

ఈ ప్రపంచంలో ఎన్నో జాతులు , తెగలు వున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష మాట్లడతారు. ఇక సాధారణంగా మనలో చాలా మంది మూడు నాలుగు భాషలు మాత్రమే మాట్లాడగలరు. కొంత మంది అంత కన్నా ఎక్కువ మాట్లాడగలరు. అయితే చాలామందికి తమ భాష తప్ప మరో భాష రాదు. ఏది ఏమైనా మనం ఏదైనా కొత్త ప్రాంతానికి కానీ తెలియని ప్రదేశంకు గాని వెళ్లినప్పుడు సహజంగానే అక్కడి ప్రజల భాష అర్థం కాదు. ఒకవేళ ఆ ప్రాంతం భాష వచ్చి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ రాకపోతే మాత్రం కష్టాలు తప్పవు .

కొత్త ప్రదేశంలో ఏం కావాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా భాష ప్రధాన పాత్ర పోషిస్తుంది.అందుకే కొత్త తరహా షర్ట్ వచ్చేసింది. ఐకాన్ స్పీక్ టీ షర్ట్ కొనుకోవడం ద్వారా ప్రపంచంలో ఏమూలకు వెళ్ళినా అక్కడ మాట్లాడే భాష ఈ టీ షర్ట్ వలన ఆ భాష తెల్సిపోతుంది. అయితే వివరాల్లోకి వేల్లాసిందే.

అవును, ఐకాన్ స్పీక్ పేరుతో మార్కెట్ లో ఇప్పుడు కొత్తరకం టీ షర్టులు దొరుకుతున్నాయి. కొత్త ప్రాంతానికి విహారానికై వెళ్లినప్పుడు రెస్టారెంట్స్, పర్యాటక ప్రాంతాలు, రూమ్లు, ఫుడ్ మొదలైన సమాచారం మనకు అవసరమవుతుంది. అలాంటి సమయంలో భాష సమస్య రావచ్చు. అయితే దీన్ని సులభంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఐకాన్ స్పీక్ టీ షర్టులను రూపొందించారు. ఈ టీషర్టుల మీద ముందు భాగంలో కావలిసిన వస్తువులను, అవసరమైన పనులను సూచించే పలు సింబల్స్ ఉంటాయి. ఉదాహరణకు ఫుడ్ని సూచించేందుకు ప్లేట్, ఫోర్క్, స్పూన్ను కలిగిన సింబల్, ప్రయాణం కోసం కారు, విమానం..అలాగన్నమాట. ఈ క్రమంలో విహారంలో ఉన్నప్పుడు ఈ టీ షర్ట్ను ధరిస్తే భాష సమస్యను సులభంగా పరిష్కరించుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. ఇంతకీ ఈ ఐకాన్ స్పీక్ టీ షర్ట్ ధర కేవలం 33 యూఎస్ డాలర్లు, అంటే మన భారతదేశ కరెన్సీలో దాదాపు రూ.2,100 అన్నమాట. మనం ఓ షర్ట్ కొనేద్దామా మరి...

1/13 Pages

English summary

Now we can travel to any country in the world without learning the local language . This will possible with the T-Shirt with 40 icons lets you to communicate in Any Country. The name of that T-Shirt was Icon Speak.