మేయర్ పీఠం కానుకగా ఇవ్వాలట 

T-TDP Meeting On GHMC Elections

01:06 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

T-TDP Meeting On GHMC Elections

గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు టిడిపి కి ఓటు వేసి గెలిపించడం ద్వారా ఎపి సిఎమ్ చంద్రబాబుకి మేయర్ పీఠం కానుకగా ఇవ్వాలట. పార్టీ నేతల పిలుపు ఇది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థుల సమావేశానికి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హాజరయ్యారు. పార్టీ నేతలు రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రావు, ఆర్‌.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులచే రమణ ప్రతిజ్ఞ చేయించారు. అంకిత భావంతో పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రమాణం చేయించారు. ఎన్నికల ప్రచార సీడీలను లోకేష్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్‌.రమణ మాట్లాడుతూ, ఏపీ రాజధాని అమరావతిని అద్భుత నగరంగా ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీహెచ్‌ఎంసీ మేయర్‌పీఠం కానుకగా ఇవ్వాలని పిలుపు నిచ్చారు. ఆ దిశగా కసరత్తు చేయాలని పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. టిడిపి అభ్యర్థులు విజయబావుటా ఎగురవేయాలని ఆకాంక్షించారు.

English summary

Telangana Telugu Desam party conducted a meeting with GHMC election TDP candidates in Hyderabad. In this meeting Telanaga TDP leader L.Ramana,Revanth Reddy,Nara Lokesh and few others were attend to this meeting in NTR bhavan