టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ ఇదే

T20 World Cup Schedule

05:20 PM ON 11th December, 2015 By Mirchi Vilas

T20 World Cup Schedule

2016లో టీ20 వరల్డ్‌ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసింద. ఈ సందర్భంగా ఇవాళ ముంబైలో టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ప్రకటించారు. మార్చి 11 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు వరల్డ్‌కప్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. మార్చి 19న భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే హై టెన్షన్ పోరుకు ధర్మశాల వేదికగా నిలువనుంది. ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. బీసీసీఐ చైర్మెన్ శశాంక్ మనోహర్ ఆధ్వర్యంలో వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కోహ్లీ, రహానే కూడా హాజరయ్యారు. తొలిసారి భారత్‌లో టీ20 వరల్డ్‌కప్‌ను నిర్వహించనున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్, ముంబై, ఢిల్లీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. భారత్ తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది.

గ్రూప్-ఎ: శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్

గ్రూప్-బి: ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్

English summary

2016 Twenty twenty world cup was going to be held in India. Today they released the schedule of the t20 world cup.Dharamsala will host the World Twenty20 2016 match between India and Pakistan on March 19