ఆ హీరోతో తాప్సీ ఎఫైర్.. ఎవరో తెలిస్తే షాకౌతారు!

Taapsee love affair with Saqib Saleem

10:29 AM ON 10th August, 2016 By Mirchi Vilas

Taapsee love affair with Saqib Saleem

సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు అనేవి ఓ అదృష్టం... ఒక్కోసారి అనూహ్యంగా అవకాశాలు వచ్చిపడతాయి. అందం - అభినయం పుష్కలంగా వున్నా ఒక్కోసారి కాలం కలిసి రాదు. అదే విధంగా అందాలకు కొరవలేకున్నా.. హిట్స్ లభించకపోవడం బాగా డీలాపడిపోయిన అందాల ముద్దుగుమ్మ తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్ పై కన్నేసి, లక్కీ ఛాన్స్ కొట్టేసిందట. ఈ అమ్మడు ముంబైకి మకాం మార్చేసి, ప్రస్తుతం సర్దుకుని కుదుట పడిందనే చెప్పాలి. అంతే కాదండోయ్.. అమితాబ్ బచ్చన్ సినిమా పింక్ లో ఓ ప్రత్యేక రోల్ లో నటిస్తూనే మరో నాలుగు సినిమాల్లో నటించే అవకాశాలను దొరక బుచ్చుకుందట. ఇందుకు కారణం ఏంటబ్బా అని పలువురు చెవులు కొరుక్కుంటున్నారట.

అయితే సాకిబ్ ను మైకు దొరికితే పొగిడేయడం.. అతనితో చెట్టాపట్టేలేసుకుని తిరగడం ద్వారా తాప్సీ ప్రేమ మైకంలో ఉందని సినీ జనం అంటున్నారు. అతనితో ఉంటే టైమ్ ఎలా గడిచిపోతుందో తెలియదంటూ తాప్సీ ఈమధ్య కామెంట్ చేసింది. కానీ ఈ వార్తలతో తాప్సీ సాకిబ్ ప్రేమలో పడటంతోనే నాలుగు సినిమా ఛాన్సులు వచ్చాయని అంటున్నారు. అంతేకాదని, తాప్సీ తన పుట్టినరోజు సందర్భంగా సాకిబ్ తో గోవాలో నాలుగు రోజులు గడిపినట్లు తెలిసింది. అయితే సాకిబ్ తో ప్రేమాయణం నిజమేనా అని అడిగితే మాత్రం తాప్సీ అదంతా ఉత్తుత్తిదే అంటోంది. షాకిబ్ ఎనర్జిటిక్ కో స్టార్ అని కితాబిచ్చింది. మొత్తానికి తాప్సి చేతికి సినిమాలు వచ్చి పడడానికి కారణం సాకిబ్ తో ప్రేమలో పడటమేనని బాలీవుడ్ జనం కోడైకూస్తోంది. కారణం ఏమిటన్నది ఆ పెరుమాళ్ళకు ఎరుక.

English summary

Taapsee love affair with Saqib Saleem