బాలయ్య వందో సినిమాలో తాప్సీ

Taapsee To Act As Heroine in Balakrishna 100th Movie

10:07 AM ON 25th January, 2016 By Mirchi Vilas

Taapsee To Act As Heroine in Balakrishna 100th Movie

అవునా , అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. 99వ చిత్రం డిక్టేటర్ అనూహ్య విజయం సాధించడంతో 100వ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా వందో సినిమాకు కసరత్తు చేస్తున్నట్టు వినికిడి. ఇందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ సరసన కథానాయకిగా తాప్సి నటించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ బలంగా నడుస్తోంది. ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ను బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే వార్తలు పోక్కాయి. ఇక ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించనున్న ట్లు , అంతేకాదు ‘ఆదిత్య 999’ అనే టైటిల్‌ను కూడా అనుకున్నట్లు తెల్సిందే. 1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం ‘ఆదిత్య 369’. ఈ చిత్రం బాలకృష్ణ సినీ కెరీర్‌లో ఓ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అందుకే వందో చిత్రం కూడా అలానే వుండాలని భావిస్తున్నారు. మరి తాప్సీ ఒక్కర్తే హీరోయిన్ గా ఉంటుందా , మరో హీరోయిన్ కూడా ఉంటుందా అనేది తేలాల్సి వుంది.

English summary

A news came to know that Heroine tapsee to act with balakrishna in his 100th movie. Bala Krishna was presently enjoying the success of dictator movie and his 100th movie to be directed by Singeetham srinivas