ఏమీ తగ్గలేదు ...

Tabu About The Criticisms On Her

10:32 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Tabu About The Criticisms On Her

'కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ' అంటూ కుర్ర కారుని కిర్రెక్కించిన టబు 1990 దశకంలో కథానాయికగా ఓ ఊపు ఊపేసింది. మరి ఇప్పుడు ఎలాంటి పాత్రలు వచ్చినా చేసేస్తోంది. గ్లామర్ తగ్గిందా , స్టార్ డం తగ్గిందా అనే అనుమానాలు వచ్చేస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో గానీ , టాలీవుడ్ లో గానీ ఇలాంటి గుసగుసలు సహజం. అయితే టబు చెవిన పడ్డాయో ఏమో గానీ ఇలాంటి వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించింది. ‘‘జనాలు నా గురించి ఏమనుకున్నా, ఎన్ని ట్యాగ్లు పెట్టి పిలుచుకున్న నేనేమీ బాధపడను. ఎందుకంటే నేను ఏం పని చేస్తున్నానో దాంతో ఆనందంగా ఉన్నాను. ఇలాంటి విమర్శల్ని ఎన్నో ఎదుర్కొన్నా. ఇవన్నీ నాకు కొత్త కాదు, అసలు లెక్కే కాదు’’ అంటోంది టబు. ఇక ఈ నెల 12న విడుదల కాబోతున్న ‘ఫితూర్‌’ సినిమాలో ఫన్నీగా, గ్లామర్‌గా ఉంటుంది నా పాత్ర ’’ అని చెప్పింది.

అంతేకాదు ‘‘నేను కథానాయికగా స్టార్‌డమ్‌ అనుభవిస్తున్న సమయంలో నే చిన్న రోల్స్‌ చేశాను. అక్కడ నిడివి ఎంతుంది అనేది కాదు. పాత్ర గొప్పదా కాదా అన్నది ముఖ్యం. హీరోయిన్‌గా నా స్టార్‌డమ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అలానే ఉంది. ఈ మధ్య చేస్తున్న అతిథి పాత్రల గురించి చాలామంది ‘నీ చేతిలో ఏం పనుంది’ అంటూ విమర్శిస్తున్నారు. అటువంటివారికి నా దగ్గర సమాధానాలు ఎన్నో వున్నాయి. నా వృత్తిలో నేను బిజీగా ఆనందంగా గడుపుతున్నా. వరుసగా మూడు కామెడీ సినిమాలు చేశానంటే ఆ తరహా పాత్రలే వస్తుంటాయి. అసలు నేను స్టార్‌ హీరోయిన్‌గా ఉన్నప్పుడే క్యారెక్టర్స్‌ చేశా. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చెయ్యడానికి ఇబ్బంది ఎలా వుంటుంది. పైగా ఇమేజ్‌కి తగ్గట్టే పాత్రలూ వస్తూండడం సహజమేగా' అని క్లాస్ పీకుతోంది టబు. అయినా గ్లామర్ తగ్గడం సహజమేగా , ఉన్నమాట అంటే ఉలుకెందుకో అంటూ బాలీవుడ్ లో ఒకటే గుసగుసలట.

English summary

Veteran Heroine Tabu who has acted with most of the top heroes.Tabu says that some of the people were Criticism for doing characters in movies.Recently she had acted in a lead role in Fitoor movie