అనుష్క తల్లి టబు!

Tabu is acting in a mother role for Anushka

01:18 PM ON 29th July, 2016 By Mirchi Vilas

Tabu is acting in a mother role for Anushka

అవునా అంటే ఏమని చెప్పాలి. వాస్తవానికి టబు.. అనుష్క.. చూస్తే ఇద్దరూ ఒకే తరానికి చెందిన టాప్ హీరోయిన్లే కదా అనుకోవడం సహజం. కానీ అటువంటిది అనుష్కకు తల్లిగా టబు అంటే ఆశ్యర్యం కాక మరేమిటి. గత పదేళ్లుగా తెలుగు సినీరంగంలో అనుష్క ప్రధాన హీరోయిన్ గా వెలుగొందుతుండగా.. గత ఇరవై ఏళ్ల నుంచి ఈ మధ్య కాలం వరకూ తెలుగులో టాప్ హీరోలందరితో ఆడిపాడిన టబు 'ఇదీ సంగతి', 'పాండురంగడు' చిత్రాల తరువాత టాలీవుడ్ వైపు కన్నెయ్యలేదు. అయితే, బాలీవుడ్ లో మాత్రం పలు హిట్ సినిమాల్లో నటిస్తోంది. మళ్లీ ఇన్నాళ్లకు టబు తెలుగు తెరపై దర్శనమివ్వనుందట.

అనుష్కకు తల్లిగా టబు కనపడనున్నట్లు తెలుస్తోంది. 'పిల్ల జమీందార్', 'సుకుమారుడు' చిత్రాల దర్శకుడు అశోక్ భాగమతి మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. చిత్రంలో అనుష్క, టబు తల్లీకూతుళ్ళుగా నటించనున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటిస్తుండగా ప్రభాస్ అతిథిగా మెరవబోతున్నాడట. మొత్తానికి భాగమతి ఇలాంటి కాంబినేషన్ తో ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి.

English summary

Tabu is acting in a mother role for Anushka