'క్షణం' లో అనసూయ చేసిన పాత్రలో టబు

Tabu is acting in Anasuya role in Kshanam hindi remake

11:59 AM ON 29th April, 2016 By Mirchi Vilas

Tabu is acting in Anasuya role in Kshanam hindi remake

ఇటీవలే చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం 'క్షణం'. అడవి శేషు, ఆదా శర్మ, సత్యం రాజేష్‌, అనసూయ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రవికాంత్‌ పెరెపు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో తెరకెక్కించబోతున్నారు. తెలుగు 'క్షణం' లో అనసూయ పోలీసాఫీసర్‌గా నటించిన పాత్రలో హిందీలో సీనియర్‌ నటి టబును ఎంచుకున్నట్లు సమాచారం. పాత్ర బాగా నచ్చడంతో టబు ఇందులో నటించడానికి వెంటనే అంగీకరించిందట. ఇటీవలే టబు 'దృశ్యం' హిందీ రీమేక్‌లో పోలీస్‌గా నటించగా మరోసారి పోలీస్‌లో పాత్రలో నటిస్తుంది. తెలుగులో సత్యం రాజేష్‌ చేసిన పాత్రలో హిందీలో నవాజుద్దీన్‌ సిద్దిఖీ చేస్తున్నారు.

English summary

Tabu is acting in Anasuya role in Kshanam hindi remake. Salman Khan is acting in Kshanam hindi remake.