ఛ ఛ ఎంత దారుణం ... 500మంది బాలికలపై పుష్కర కాలంగా ..

Tailor Sunil Rastogi arrested for sexually abusing over 500 girls in 12 years

11:32 AM ON 18th January, 2017 By Mirchi Vilas

Tailor Sunil Rastogi arrested for sexually abusing over 500 girls in 12 years

దారుణాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. ముఖ్యంగా మహిళపై , బాలికలపై అత్యాచారాలు , లైంగిక వేధింపులు పెచ్చుమీరుతున్నాయి . భయం లేకుండా నేరాలు సాగించేస్తున్నారు. ఇక తాజాగా ఢిల్లీలో 38ఏళ్ల ఓ టైలర్ జరిపిన అకృత్యాలు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. దాదాపు దశాబ్దకాలంగా సునిల్ రాస్తొగి అనే టైలర్ వందల మంది మైనర్ బాలికలపై జరిపిన దారుణాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లయి..ఐదుగురు సంతానమున్న (ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు) రాస్తొగి ఒకరి కాదు ఇద్దరు ఏకంగా దాదాపు 500మంది బాలికలపై 12ఏళ్లుగా అత్యాచారం జరుపుతున్నట్టు పోలీస్ విచారణలో తేలింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో రాస్తోగి విస్మయపరిచే విషయాలు చెప్పాడు. ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ కు చెందిన రాస్తోగి...ఢిల్లీలోని అశోక్ నగర్ లో కొంతకాలంగా నివశిస్తూ అక్కడి ఎస్ఎస్ టైలర్ షాపులో బట్టలు కుడుతున్నాడు. స్కూల్స్, ట్యూషన్లకు వెళ్లే 7 నుంచి పదేళ్లలోపు వయసుండే బాలికలపై కన్నేసి, వాళ్లకు మాయమాటలు చెప్పి..12ఏళ్లుగా వారిపై అత్యాచారం జరుపుతున్నాడు.

కొత్తబట్టలు కొంటానని... మీ నాన్నే ఈ బట్టలు పంపించారనో.. చాక్లెట్లు, స్వీట్లు కొనిస్తానో చెప్పి..నిర్మానుష్య ప్రాంతాలకు బాలికల్ని లాక్కెళ్లి అత్యాచారం జరిపేవాడట. ఉత్తరాఖండ్, యూపీ, ఢిల్లీలలో పలు ఏరియాల్లో కాపురం పెట్టిన రాస్తొగి...ఎక్కడ నివసించినా.. బాలికలే అతడి టార్గెట్గా వ్యూహాలు పన్నేవాడని పోలీసులు చెప్పారు. ఇదే క్రమంలో జనవరి 10 ఇద్దరి బాలికలకు ఇలాగే మాయమాటలు చెప్పి నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. భయందోళనతో ఆ బాలికలు కేకలు వేయడంతో రస్తోగి పారిపోయాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు రాస్తొగిని అరెస్టు చేయడంతో ఈరాక్షసుడి దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. మరో దిగ్బ్రాంతికర విషయం ఏంటంటే, రాస్తొగి తన ముగ్గురు కూతుళ్లపై కూడా లైంగిక దాడి చేసి ఉండవచ్చన్నది పోలీస్ ల అనుమానిస్తున్నారు.

ఇది కూడా చూడండి: రోజా ను మీరు 'బ్లూ ఫిలిం' లో నటించారా? అని అడిగిన యాంకర్

ఇది కూడా చూడండి: నాలుక కోస్తావా..? నీ ఇంటికొస్తా.. టచ్ చేసి చూడు. ..

English summary

Tailor Sunil Rastogi arrested for sexually abusing over 500 girls in 12 years.