భారత టూర్ పై త్వరగా నిర్ణయం తీసుకోండి 

Take a quick decision on the Indian Tour

10:31 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Take a quick decision on the Indian Tour

భారతదేశం త్వరలో ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ టీమ్ పాల్గొనడం పై సస్పెన్స్ వీడలేదు. టీ20 మెగాటోర్నీలో పాల్గొనే అంశంపై పాక్‌ ప్రభుత్వం వారం రోజుల లోపు నిర్ణయం ప్రకటించాలని ఆ దేశ క్రికెట్‌ బోర్డు కోరింది.

పాక్‌ బృందం భారత్‌కు వెళ్లడం పై ఆ దేశ ప్రభుత్వం వారంలోపు నిర్ణయం తీసుకోగలదని ఆశిస్తున్నట్లు పీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే క్రికెటర్ల వీసాల ప్రక్రియ పూర్తి అయినట్లు పీసీబీ మీడియా డైరెక్టర్‌ అంజాద్‌ హుస్సేన్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో భారత్‌లో పాక్‌ క్రికెటర్లకు అత్యున్నత భద్రత కల్పిస్తామని బీసీసీఐ హామీ ఇచ్చింది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను తటస్థ వేదికలో నిర్వహించాలని పాక్‌ గతంలో కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీని పై ఆలోచించడం లేదని, పర్యటన అనుమతి కోసం వేచి చూస్తున్నామని పీసీబీ వెల్లడించింది. టీ20 షెడ్యూలు ప్రకారం మార్చి 19న ధర్మశాలలో ఇరు జట్లు తలపడాల్సి ఉంది.

English summary

Pakistan Cricket Board Has asked Pakistan Government to say their decision about that Pakistan to participate in T20 world cup which was going to be held in India in this year.Indian Government has already said that it provides good security to the entire Pakistan Cricket Team