అప్పుడే నాకు  కిక్కు ....

Tamanna About Critics

01:11 PM ON 20th February, 2016 By Mirchi Vilas

Tamanna About Critics

బాహుబలితో 'పచ్చ బొట్టేసినా' అంటూ ఒయ్యారాలు ఒలక బోసే తమన్నా ఇప్పుడు ‘ఊపిరి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ముద్దుగుమ్మ విమర్శల వలన ఒనగూరే ప్రయోజనం వివరించింది. విమర్శే నన్ను ఉన్నతమైన స్థానానికి చేర్చిందని చెప్పే ఈ భామ ఇంకా ఏమందో తెలుసా ... ‘‘బాగా చేశావన్న ఒకరి మెప్పు, ప్రోత్సాహం నా పై ఎంత ప్రభావం చూపిందో తెలియదు కానీ... విమర్శ మాత్రం ఎప్పటికప్పుడు కొత్త పాఠాల్ని నేర్చుకొనేందుకు కారణమైంది. ఒకరు వేలెత్తి తప్పొప్పులు చూపిస్తేనే కదా మనకు నిజమేంటో తెలిసేది! సినిమా రంగంలో విమర్శని స్వీకరించే ప్రక్రియ చాలా ముఖ్యం. అందుకే ఎప్పటికప్పుడు నా నటనపై ప్రేక్షకుల అభిప్రాయమేమిటో తెలుసుకొంటా. అసలు మన గురించి వేరొకరు ఏమనుకొంటున్నారని తెలుసుకోవడంలోనే నాకు కిక్కు దొరుకుతుంటుంది. ’’ అని అంటోంది. ‘‘సినిమా రంగంలో ఏదైనా అదృష్టంమీదే ఆధారపడుతుందని నమ్ముతుంటా. ఒక్కోసారి సినిమా ప్రేక్షకులకు చేరువ కాకపోతే నేను ఎంత బాగా నటించినా ఆ శ్రమ ఎవ్వరికీ కనిపించదు. అదే సినిమా ప్రేక్షకాదరణ పొందితే నేను పడ్డ సాధారణ శ్రమ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటారు. అందుకే నటన విషయంలో క్రెడిట్‌ ఇస్తే నేను స్వీకరించను. బాగా చేసానా లేదా అన్నదే చూసుకుంటూ, ప్రేక్షకుల నాడికి అనుగుణంగా పనిచేసుకు పోతా' అని తమన్నా చెప్పుకొచ్చింది

English summary

Milky Beauty Tamanna Say that she will not bother for Criticism on her.Tamanna says that will help her to improve her acting and skills.Present She was acting in Oopiri movie along with Nagarjuna and Karthi