చిరు 150 వ సినిమాలో నయన్‌, తమన్నా

Tamanna And Nayanathara To Act In CHiranjeevi 150th Film

02:00 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Tamanna And Nayanathara To Act In CHiranjeevi 150th Film

చిరంజీవి 150 వ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ఇటీవల రామ్‌చరణ్‌ బెంగళూరు లో జరిగిన ఒక వేడుక లో చిరంజీవి తన 150 వ సినిమా గా తమిళం లో సూపర్ హిట్ అయిన 'కత్తి' సినిమాకు తెలుగు లో రీమేక్ చేయ్యనున్నాడని . ఈ సినిమాకు వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించనున్నాడని స్పష్టం చేసాడు.

దీంతో చిరు 150వ సినిమా చిరంజీవి సరసన నటించే హీరోయిన్‌ ఎవరా అని అందరూ ఆసక్తి గా ఎదరు చూస్తున్నారు. చిరంజీవి తో నటించడానికి అనేక మంది హీరోయిన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే చిరు సరసన నయనతార, తమన్నాలు నటించే ఆవకాశం ఎక్కువుందని తెలుస్తోంది. దర్శకుడు వినాయక్‌ కూడా తమన్నా, నయనతారలను ఒకే చెస్తాడని సమాచారం. మరో వైపు చిరు 150వ చిత్రంతో విలన్‌గా బాలీవుడ్‌ హీరో వివేక్‌ఒబేరామ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం పై వివేక్‌ను సంప్రదించగా ఆయన కూడా ఓకే అన్నట్లు సమాచారం.

ప్రస్తుతం చిరంజీవి, రామ్‌చరణ్‌లు చిరు 150వ సినిమా కత్తి రీమేక్‌ సినిమా పై పూర్తి దృష్టి పెట్టారు. ఈ సినిమా పై అందరి లోను ఆసక్తి నెలకొంది. ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

English summary

Recently Ramcharan said that chiranjeevi is going to remake kathi movie as his 150 th film. in this movie tammna and nayanathara to act as heroines and vivek oberai to act as villian in this movie. Director V.V.Vinayak is going to be direct this movie