బతికిపోయాం తమన్నా లెస్బియన్ కాదు

Tamanna as a lesbian in Oopiri movie

12:34 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Tamanna as a lesbian in Oopiri movie

శేఖర్ కమ్ముల సృష్టించిన 'హ్యాపీడేస్' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మిల్కీబ్యూటీ తమన్నా ఆ తరువాత చాలా చిత్రాల్లో తన అందం, నటన తో ప్రేక్షకులను కట్టి పాడేసింది. ఇక గత సంవత్సరం విడుదలైన ‘బాహుబలి’ చిత్రంలో ఆమె దేవకన్యలా కనిపిస్తూనే.. పోరాట యోధురాలిగా విభిన్నమైన పాత్రలో నటించి, డ్యూయల్ రోల్ ని మరపించి, మెప్పించింది. అంతేకాదు ఈ సినిమాతో తమన్నాకు తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో అమాంతం పేరు వచ్చింది. గతంలో తమన్నా తెలుగు, హిందీ భాషల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు బాహుబలి చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 'బాహుబలి 2' లో నటిస్తోన్న తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ‘ఊపిరి’ చిత్రంలో నాగార్జున సరసన చేస్తోంది.

ఫ్రెంచ్ చిత్రం 'అన్ టచ్బుల్స్' కు రీమేక్ గా వస్తున్న 'ఊపిరి' చిత్రం లో తమన్నా నాగార్జున పర్సనల్ వ్యవహారాలు చూసుకునే అమ్మాయిగా నటిస్తోంది.. అయితే వాస్తవానికి ఒరిజినల్ చిత్రంలో ఆ పాత్ర ఓ లెస్బియన్ పాత్ర అని చెబుతున్నారు. అయితే తెలుగు సెంటిమెంట్ కి అణుగుణంగా పాత్ర స్వరూపాన్ని మార్చారని వినికిడి. పైగా ‘బాహుబలి’ చిత్రంతో సడన్ గా స్టార్డమ్ పెరిగిపోయిన, ఇలాంటి సమయంలో ఫ్రెంచ్ చిత్రం అన్ టచ్బుల్స్ నటించి లెస్బియన్ పాత్రలో కనిపిస్తే తన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందని గ్రహించి, తెలుగు ఆమె పాత్రని పూర్తి స్థాయిలో మార్చారట. నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన ఈ సినిమాలో తమన్నా పాత్ర పేరు కీర్తి.

ఆమె మిలియనీర్ అయిన నాగార్జునకు పర్సనల్ అసిస్టెంట్ గా కనపించబోతోంది. ఇక సినిమా విషయానికి వస్తే.. నాగార్జున పాత్ర పేరు విక్రమాదిత్య, ఓ బిలియనీర్‌గా కనిపిస్తాడు. మొత్తానికి తమన్నా ఇమేజ్ కి అనుగుణంగా రీమేక్ లో 'ఊపిరి' వస్తోంది.

English summary

Tamanna as a lesbian in Oopiri movie. Tamanna latest movie Oopiri. In this movie Akkineni Nagarjuna and Karthi is acting as a heroes. This is the remake of French movie.