ఎన్టీఆర్‌ తో తమన్నా ఐటమ్‌ సాంగ్‌!!

Tamanna doing item song with Ntr

06:23 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Tamanna doing item song with Ntr

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న 25వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఘాటింగ్‌ ప్రస్తుతం స్పెయిన్‌లో చివరి షెడ్యూల్‌ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌ అయిపోయాక సుకుమార్‌ టీమ్‌ హైదరాబాద్‌ చేరుకుంటుంది. అయితే సుకుమార్‌ ప్రతీ సినిమాలో ఐటమ్‌సాంగ్‌ కన్ఫార్మ్‌. దానికి తగ్గట్టుగానే దేవీశ్రీప్రసాద్‌ ఐటమ్‌సాంగ్‌ని కంపోజ్‌ చేస్తాడు. ఈ చిత్రంలో కూడా దేవీశ్రీప్రసాద్‌ మంచి మాస్‌ మసాలా ఐటమ్‌ సాంగ్‌ని రెడీ చేశాడట. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ ఐటమ్‌ సాంగ్‌కి తమన్నా అయితే బాగుంటుందని సుకుమార్‌కి సలహా ఇచ్చాడట.

సుకుమార్‌ కూడా తమన్నా బాగుంటుందని అభిప్రాయపడుతున్నాడట. తమన్నా కి ఐటమ్‌సాంగ్‌ కొత్తేం కాదు ఇంతకుముందు అల్లుడు శీను లో కూడా ఐటమ్‌ సాంగ్‌ చేసింది. ఇప్పుడు నాన్నకు ప్రేమతో లో కూడా ఐటమ్‌ సాంగ్‌ చెయ్యడం కోసం నిర్మాతలు తమన్నాని సంప్రదించారట. అయితే తమన్నా ఎక్కువ పారితోషకం డిమ్యాండ్ చెయ్యడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

English summary

Tamanna doing item song with Ntr in Nannaku Prematho. This movie is directing by Sukumar and music composed by Devi Sri Prasad