'బాహుబలి 2' తరువాత పెళ్ళికి రెడీ!

Tamanna is ready to marry her boyfriend

03:40 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Tamanna is ready to marry her boyfriend

2005 లో మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్నా మొదటి చిత్రమే అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆ తరువాత 2007లో శేఖర్ ఖమ్ముల తెరకెక్కించిన 'హ్యాపీ డేస్' చిత్రంతో తమన్నా కెరీర్ ఊపందుకుంది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో తమన్నా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తరువాత సిద్ధార్థ్, నాగ చైతన్య, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ చిత్రాల్లో నటించింది. అయితే తమన్నా నటించిన ప్రతీ చిత్రం దాదాపు అట్టర్ ఫ్లాప్ గానే నిలిచాయి. ఏదో ఒకటి రెండు చిత్రాలు తప్ప తమన్నా నటించిన ప్రతీ చిత్రం అట్టర్ ఫ్లాపే.

అయినా సరే తమన్నా ఇప్పటికి స్టార్ హీరోయిన్ రేస్ లో ఉంది. అయితే ఇప్పుడు తమన్నా గురించి బాలీవుడ్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే తమన్నా ‘బాహుబలి 2’ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్‌‌లో సెటిల్ కావాలని ప్లాన్ చేస్తోందట. పెళ్లి చేసుకుని వెండితెరకు గుడ్ బై చెప్పేయాలనే ఆలోచనలో వుందని సమాచారం. ఇంకా లోతుగా వెళ్తే.. రెండు సంవత్సరాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్‌కి చెందిన ఓ వ్యక్తితో తమన్నా డేటింగ్ చేస్తోందని, వీళ్లద్దరి మధ్య ఉన్న స్నేహం వివాహానికి దారి తీస్తుందని సమాచారం. తమన్నా కి కాబోయే భర్త కంప్యూటర్ ఇంజనీర్ అట. ప్రస్తుతం చేస్తున్న సినిమాలను పూర్తి చేసి.. ఇంక కొత్త సినిమాలను ఒప్పుకోకూడదని తమన్నా ప్లాన్ అట.

అందుకే ఎన్టీఆర్ ‘జనతా ‌గ్యారేజ్’ చిత్రంలో ఐటమ్ సాంగ్ కి డేట్స్ లేవని చెప్పేసిందట. పెళ్ళి తర్వాత తాను స్థాపించిన గోల్డ్ డిజైన్ కంపెనీ వైట్ అండ్ గోల్డ్ బిజినెస్ వ్యవహారాల పై దృష్టి పెడుతుందని వార్తలు వస్తున్నాయి.

English summary

Tamanna is ready to marry her boyfriend. Hot milky beauty Tamanna Bhatia is ready to marry her family friend after completion of Baahubali 2 shooting. After that she want to do business.