మెగాకు కిక్కెక్కిస్తున్న తమన్నా ఐటెం ..

Tamanna Item Song In Chiranjeevi 150th Movie

10:30 AM ON 31st August, 2016 By Mirchi Vilas

Tamanna Item Song In Chiranjeevi 150th Movie

మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీకి అన్ని మసాలాలు దట్టిస్తున్నారు. సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తూ తీస్తున్న ఖైదీ నెంబర్ 150 మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకి మరో గుడ్ న్యూస్ చెబుతూ యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం చాలా కేర్ తీసుకుంటున్న చిరు, ఇందులో ఓ కిక్కెక్కించే ఐటమ్ సాంగ్ లో డాన్స్ ఇరగదీయనున్నాడని టాక్. తన స్పీడ్ కి డాన్స్ చేసే హీరోయిన్ ఎవరా అని చూస్తే యూనిట్ మొత్తం తమన్నా పేరే చెప్పిందట. రీసెంట్ గా అభినేత్రి మూవీ టీజర్ లో లేడీ ప్రభుదేవా మాదిరిగా డాన్స్ ఇరగదీసిన తమన్నా అయితే తన స్పీడ్ ని అందుకోగలదని భావించి ఆమె ఫిక్స్ చేసినట్టు సమాచారం

టాలీవుడ్ హీరోయిన్లలో బెస్ట్ డ్యాన్సర్ గా పేరున్న తమన్నా, చిరంజీవి లాంటి గ్రేట్ డ్యాన్సర్ తో కలిసి స్టెప్పులెయ్యడానికి స్పెషల్ సాంగ్ స్పెషలిస్ట్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ రెడీ చేసినట్టు ఇన్ సైడ్ న్యూస్. అంతకుముందు చిరంజీవి సినిమాలో సిమ్రాన్ తో చేసిన ఆటకావాలా పాటకావాలా సాంగ్ మించిపోయేలా ఇది వుండనున్నట్లు యూనిట్ టాక్. మొత్తానికి ఈ సినిమా ఇటు అభిమానుల్లో, అటు ఇండస్ట్రీలో కూడా పెద్ద టాక్ అయి కూర్చుంది.

ఇవి కూడా చదవండి:పవర్ స్టార్ పై పిర్యాదు... అయితే...

ఇవి కూడా చదవండి:ఈ దేశాల్లో చనిపోయిన మనిషిని ఏం చేస్తారో తెలిస్తే షాకౌతారు!

English summary

All Set For Megastar Chiranjeevi 150th film and the shooting of the movie was also going fastly and now a new update that Milky Beauty Tamanna to act in a item song in Chiranjeevi 150th movie named Khaidi No.150.