మిల్క్ బ్యూటీకి అడిగినంతా ఇప్పిస్తున్నడైరెక్టర్

Tamanna offer to sampath

10:37 AM ON 21st July, 2016 By Mirchi Vilas

Tamanna offer to sampath

మిల్కీబ్యూటీ తమన్నా సెంటిమెంట్‌ని నమ్ముతుందా? అవునో కాదో తెలీదుగానీ, ఓ డైరెక్టర్ మాత్రం ఆమెని సెంటిమెంట్‌తో కొట్టి తన న్యూప్రాజెక్ట్‌లో నటించేలా చేశాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఆ సెంటిమెంట్ ఏంటి? చెర్రీతో రచ్చ తర్వాత ఓ రేంజ్లో మార్మోగిన పేరు సంపత్‌నంది. దీంతో పవన్‌తో ఆయన గబ్బర్‌సింగ్ 2 చిత్రం చేస్తాడంటూ క్యాంపెయిన్ సాగింది. ఇక ఆ విషయం పక్కనబెడితే..

గోపిచంద్ హీరోగా సంపత్ ఓ మూవీ చేస్తున్నాడు. కాకపోతే ఆయనకు తమన్నా సెంటిమెంట్! ఎందుకంటే ఆయన డైరెక్షన్లో వచ్చిన రచ్చ, బెంగాల్ టైగర్ చిత్రాల్లో ఆమె నటించింది. అవి బాక్సాఫీసు వద్ద విజయం సాధించాయి. దీంతో ఈ సెంటిమెంట్ సంపత్‌ని వెంటాడుతోంది. ఈ క్రమంలో ఆమె తన ప్రాజెక్ట్‌లో వుంటే హిట్ అవుతుందని నమ్మకంతో ఈ డైరెక్టర్, రీసెంట్గా మిల్కీబ్యూటీని సంప్రదించి విషయం చెప్పి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేలా చేసుకున్నాడు. సెంటిమెంట్ కాబట్టి ఆమె డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ కూడా మేకర్స్ ఇస్తున్నట్లు టాక్. ఇందులో తమన్నాకు చిన్న రోల్‌తోపాటు ఐటెంసాంగ్ చేసే ఛాన్స్ వుందని ఇన్సైడ్ టాక్. మొత్తానికి సెంటి మెంట్ పేరుతో సంపత్ చేస్తున్నది బానే ఉంది. అయితే వీరిద్దరి మధ్యా కెమిస్ట్రీ ఏమైనా వర్కవుట్ అయిందా అంటూ కామెంట్స్ పడుతున్నాయి.

ఇది కూడా చూడండి: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం

ఇది కూడా చూడండి: టాలీవుడ్ హీరో ల పారితోషికాలు

ఇది కూడా చూడండి: న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది.?

English summary

Sampath Nandi has done two films with milky beauty Tamanna first film is Rachcha and another film is Bengal Tiger. Now another project is doing with tamanna