గుర్రమెక్కుతోంది ... కత్తి తిప్పుతోంది ...

Tamanna Practicing Horse Riding For Baahubali 2

11:41 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

Tamanna Practicing Horse Riding For Baahubali 2

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి: ది బిగినింగ్ ' మూవీ చాటి చెప్పింది. ప్రభాస్ , రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాక్సాఫీసు వసూళ్లతో సంచలనం సృష్టించడంతో పాటు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’ నిల్చింది. దీనికి రెండో బాగంగా తెరకెక్కుతున్న ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్లే తొలి భాగాన్ని మించిపోయేలా చిత్రబృందం ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతోంది. వచ్చే ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’ గురించి అవంతిక పాత్రలో నటిస్తున్న తమన్నా కొన్ని విషయాలు చెప్పింది.

‘బాహుబలి: ది బిగినింగ్ ’తో పోలిస్తే రెండో భాగంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది. తొలి భాగంలో నేను ఓ మామూలు అమ్మాయిగానే ఎక్కువ కనిపిస్తా. అందులో నాకు పాటలు, డ్యాన్సులు ఉన్నాయి. కానీ ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’లో యోధురాలిగా పోరాటాలు చేస్తా. కత్తియుద్ధం, గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తా. దాని కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నా' అని తమన్నా చెబుతోంది.

‘బాహుబలి’ ప్రస్తావన రాగానే అందరూ ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అని అడుగుతున్నారు. దానికి నేను సమాధానం చెప్పలేను. ఈ సినిమా కథకు సంబంధించిన విషయాలు వెల్లడించకూడదని ఒప్పందం ఉంది. రెండో భాగంలో ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

ఇది కూడా చూడండి: పతకం రాలేదని బట్టలు విప్పేసారు (వీడియో)

ఇది కూడా చూడండి: ఆంధ్రాలో జనాభా కన్నా మొబైల్స్ ఎక్కువట

ఇది కూడా చూడండి: అది కూడా ఎన్టీఆర్ కి సెంటిమెంటేనా?

English summary

Beauty Tamanna Practicing Horse Riding For Baahubali 2 climax shooting.