పెళ్లి పై స్పందించిన తమన్నా

Tamanna Responds On Her Marriage Rumors

01:40 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Tamanna Responds On Her Marriage Rumors

ఇటీవల కొద్ది రోజులుగా మిల్కీ బ్యూటి తమన్నా పెళ్లి చేసుకోబోతోందన్న విషయం పై తమన్నా క్లారిటీ ఇచ్చింది . తమన్నా ముంబాయి కి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్ళి చేసుకోబోతోందని వార్తలు హల్ చల్ చేస్తున్న నేపధ్యంలో ఆ వార్తల పై తమన్నా ఆఖరికి స్పందించింది . మీడియా లో వచ్చిన వార్తలన్నీ వట్టి మాటలేనని కొట్టి పారేసింది. "నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం లేదని , దానికి ఇంకా చాలా టైం ఉంది , ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకున్నా ముందు మీడియాకు చెబుతా , ఇలాంటి పుకార్లని దయచేసి ఆపేయండి’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది .

ఇవి కూడా చదవండి : కోహ్లీ నన్ను లైంగికంగా వేధించాడు

ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ , తమిళ , తెలుగు భాషలలో ప్రభుదేవ నిర్మిస్తున్న‘అభినేత్రి’ అనే హారర్ సినిమాతో పాటు తమిళంలో ‘ధర్మ దురై’ , ‘బాహుబలి 2’ , బాలీవుడ్ లో రన్ వీర్ సింగ్ సరసన కూడా ఒక సినిమాలో నటిస్తోంది . ఇలా చేతినిండా బోలెడన్ని సినిమాలున్న టైం లో ఎవరినా పెళ్లి చేసుకుంటారా మీరే చెప్పండి.

ఇవి కూడా చదవండి :

కోడిగుడ్డుతో..3 రోజుల్లో 3 కిలోలు తగ్గండి

పబ్లిక్ గా త్రిషకు ముద్దు పెట్టిన బాలయ్య

ట్రైలర్‌ ఏడు గంటలు - సినిమా 30రొజులు

English summary

Milky Beauty Tamanna responds on the rumors that coming on her marriage. She says that she was not going to get married. please don't spread rumors on her and she also said that she will say if she was going to marry. Presently she was busy with Bahubali-2, Bollywood Movie with Ranveer Singh,Tamil Film and a Horror film with Prabhu Deva.