తమన్నా చెప్పిన సీక్రెట్‌

Tamanna reveals her personal secrets

06:05 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Tamanna reveals her personal secrets

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో విజయవంతంగా దూసుకుపోతున్న నటులలో తమన్నా ఒకరు. ఊపిరి సినిమాతో త్వరలో మన ముందుకు రానున్న మిల్కీ బ్యూటీకి టాలీవుడ్‌లో బాగా ఫాలోయింగ్‌ ఎక్కువే. ఈ ముద్దుగుమ్మకి ఫేస్‌బుక్‌ పేజిలో కోటికిపైగానే ఫాలోవర్స్‌ ఉన్నారంటే ఈమె క్రేజ్‌ ఏరేంజ్‌లో ఉందో అర్ధం అవుతుంది. అంత క్రేజ్‌ కలిగిన ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత విషయాలను కొన్ని వెల్లడించారు. ఆమె బలం బలహీనత గురించి కొన్ని విషయాలు షేర్‌ చేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఆమె కెరీర్‌ మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేదట. భాష రాకపోవడంతో ఆమె ఎన్నో ఇక్కట్లు ఫేస్‌ చేసారట. దాంతో ఆసమస్యను ఎలాగైనా అధిగమించాలని తెలుగు, తమిళం భాషలను నేర్చుకోవాలని నిర్ణయించుకుని ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెట్టింది. నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డానని దాని ఫలితంగా ఇప్పుడు ఈ రెండు భాషలను చక్కగా మాట్లాడు గలుగుతున్నా అని అమ్మడు చెప్పింది. అంటే ఆమె ఏదైనా అనుకుంటే సాదించేవరకూ పట్టువిడువని విక్రమార్కుడిలా.....పట్టుదలతో పని చేస్తానని ఆ పట్టుదలే తన బలమని తమన్నా పేర్కొంది.

అలాగే బలం గురించి చెప్తూ బలహీనత గురించి కూడా తెలిపింది. తన మనస్సుకు కష్టం కలిగించే ఏదైనా సంఘటన జరిగితే దాని గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుందట తమన్నా. చాలా రోజుల పాటు ఆ ఘటన ఆమెను వేధిస్తూనే ఉంటుందట. అంత త్వరగా ఆమె మరిచిపోలేనని అంటుంది. అలా మరిచిపోలేక పోవడమే నా బలహీనత అని తమన్నా చెప్పింది.

English summary

Tamanna reveals her personal secrets, Tamanna Bhatia is one of the most gorgeous actresses of South Indian film industry. She reveals her personal secrets.