'ఐఫా' లో తమన్నా సెల్ఫీ ల పిచ్చి!!

Tamanna selfies in IIFA awards

11:50 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Tamanna selfies in IIFA awards

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియమ్ లో ఐఫా అవార్డ్స్ వేడుకలు రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో సినీ తారలు తమదైన శైలి లో మెరిసిన విషయం తెలిసిందే. టాప్ హీరోలు సూటూ బూటు వేసుకుని ముస్తాబై వస్తే, హీరోయిన్లు మాత్రం హాట్ హాట్ గా కనిపించారు. అంతే కాదు ఈ అవార్డ్స్ వేడుకలో రామ్ చరణ్, అఖిల్, శ్రియ, ప్రభుదేవా, తమన్నా లు లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అదరకొట్టారు. అయితే తమన్నా మాత్రం హాట్ హాట్ గా డ్యాన్స్ వెయ్యడమే కాదు వెరైటీ గా డ్యాన్స్ వేసింది. మొదట 'బాహుబలి' లో ధీవర పాటకు దేవకన్యలా స్టేజ్ పైకి దిగిన తమన్నా ఆ తరువాత డ్యాన్స్ తో ఇరగ తీసింది.

ఆమె అందాన్ని, అభినయాన్ని చూడటానికి అక్కడికొచ్చిన వారికి రెండు కళ్లూ చాలలేదు. హాట్ హాట్ లుక్స్ తో కనిపించిన తమన్నా ఆ తరువాత తన చివరిపాటగా 'సెల్ఫీ పుళ్లా' సాంగ్ కు స్టెప్పులు వేసిన తర్వాత, పనిలో పనిగా స్టేజ్ కిందికి దిగి అక్కినేని నాగార్జునతోనూ, సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ సెల్ఫీలు దిగి అందర్నీ ఆశ్చర్య పరిచి ఇది కూడా డ్యాన్స్ లో ఒక భాగమే అనేలా ప్రవర్తించింది ఈ మిల్కీ బ్యూటీ.


English summary

IIFA 2015 awards function was held on January 25, 26 2016 at Hyderabad Gachibowli stadium grandly. In this awards function Tamanna gave hot stage life performance.