నా కోరిక తీరింది

Tamanna To Act With Prabhudeva

10:17 AM ON 9th February, 2016 By Mirchi Vilas

Tamanna To Act With Prabhudeva

హ్యాపిడేస్ తో ఎంటరయ్యి, బాహుబలితో తారాస్థాయికి చేరిన అందాల భామ తమన్నా ఓ పక్క .... ఇక అదిరిపోయే స్టెప్పుల తో గుర్తొచ్చే ప్రభుదేవా మరోపక్క . ఈ ఇద్దరూ ఇప్పుడు కల్సి చెందేస్తున్నారు. తొలి కాంబినేషన్ కూడా. ప్రభుదేవా కథానాయకుడిగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రభుదేవా తన సొంత నిర్మాణ సంస్థలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోన్న తమన్నా 'ఆయన(ప్రభు) తో కలిసి నటించాలని తహతహలాడుతోన్న నా కోరిక తీరింది' అని చెబుతోంది. ' ప్రభు సార్‌తో నటించాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఆయనతో పనిచేయడం నాకు తొలిసారి. మా ఇద్దరికీ ఫొటోషూట్‌ జరిగింది. మా జంట బాగా అనిపించింది ప్రభుదేవాతో కలిసి స్టెప్పులేయడం గురించే కాస్త కంగారుగా ఉంది ‘‘ప్రభుదేవా కథానాయకుడిగా చాలా కాలం తర్వాత నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన స్టెప్పుల వేగానికి తగ్గట్టు డ్యాన్స్‌ చేయడం నాకు సవాలే’’అని చెబుతోందీ ఈ అందాల పచ్చ బొట్టు భామ .

English summary