ఐటెం సాంగ్ కి రూ. కోటి తీసుకున్న తమన్నా.. అందుకే రెచ్చిపోయింది..

Tamanna very hot in Jaguar item song

01:12 PM ON 21st September, 2016 By Mirchi Vilas

Tamanna very hot in Jaguar item song

గతంలో వచ్చిన సినిమాల్లో ఐటెం సాంగ్ ల కోసం ప్రత్యేకంగా కొంతమంది ఉండేవారు. జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనూరాధ, సిల్క్ స్మిత ఇలా వాళ్ళ కేరాఫ్ అడ్రస్ అదే. కానీ రోజులు మారాయి. ఈ ఐటెం సాంగ్స్ మీద స్టార్ హీరోయిన్లు కూడా కన్నేశారు. పైగా ఇందుకోసం దండిగా డబ్బులు కూడా కురిపిస్తుండడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న యావ పెరిగిపోయింది. అందుకే ముద్దుగుమ్మలు సైతం, ఐటెం భామలు అయిపోతున్నారు. బాలీవుడ్లో మొదలైన ఈ ట్రెడిషన్.. ఇప్పుడు సౌత్ ఇండియాలోనూ ఊపందుకుంటోంది. తమన్నా.. శ్రుతి హాసన్.. కాజల్ లాంటి టాప్ హీరోయిన్లు ఐటెం పాటల్లో అదరగొట్టేశారు. వీరిలో ముందుగా స్పెషల్ సాంగ్ చేసింది మిల్కీ బ్యూటీనే.

'అల్లుడు శీను' సినిమాలో 'నా ఇంటి పేరు సిల్క్' అంటూ సాగే పాటలో అదరగొట్టేసింది తమన్నా, ఆ తర్వాత 'స్పీడున్నోడు'లోనూ ఐటెం పాటలో ఆకట్టుకుంది. తాజాగా తమన్నా.. కన్నడ కుర్రాడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న 'జాగ్వార్' కోసం ఐటెం భామ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో నిఖిల్ ను హీరోగా నిలబెట్టడానికి కుమారస్వామి డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నాడు. ఈ సినిమా రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం విశేషం. ఇక ఐటెం సాంగ్ కి సంబంధించిన స్టిల్స్ బయటికి వచ్చాయి. అందులో తమన్నా లుక్ అదిరిపోయిందనే చెప్పాలి.

ఆమె డ్రెస్ కానీ.. ఆమె హావభావాలు కానీ చూస్తుంటే ఈ పాటలో తమన్నా సెగలు పుట్టించబోతోందని అంటున్నారు. ఈ పాట కోసం తమ్మూ కోటి రూపాయల దాకా పారితోషకం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో, మరి అంత తీసుకున్నాక ఈమాత్రం రెచ్చిపోకుంటే ఎలా గమ్మడూ అంటూ కామెంట్స్ పడుతున్నాయి.

ఇది కూడా చదవండి: కార్ నడుపుతూ ముద్దుల్లో మునిగి తేలిన ఇద్దరమ్మాయిలు.. ఇంతలో..

ఇది కూడా చదవండి: చైతూ-సమంతాల ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దాసరి!

ఇది కూడా చదవండి: 'ప్రేమమ్' ట్రైలర్ లో క్రియేటివ్ గా ఒకటి పెట్టారు.. అదేమిటో కనిపెట్టగలరా?

English summary

Tamanna very hot in Jaguar item song. Hot milky beauty doing item song in Kannada hero Nikhil Kumar's Jaguar movie. She taken 1 crore for item song.