అష్టాచెమ్మా పిక్కలకి గిరాకీ..

Tamarind Seeds For Sale

01:45 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Tamarind Seeds For Sale

ప్రతి ఒక్కరికీ ఓరోజు వస్తుంది. అలాగే చింత పిక్కలకి రోజొచ్చింది. నిజమండి బాబు ఇది వాస్తవం. చిన్నప్పుడు అష్టాచెమ్మా ఆడేవాళ్ళం. అరుగుమీద చింతపిక్కల ఆటలకు మాత్రమే పనికొచ్చే చింతపిక్కలకి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. అవును మెట్టలో చింతపిక్కల ధర కిలో రూ.17. ఇంటింటికీ వచ్చి కొనుగోలు చేస్తారట. అక్కడ కిలో రూ.10 లు. ఇక్కడ కొని హోల్ సేల్ గా అమ్మితే అక్కడ వంద కిలోలూ.. రూ. 1700 చింతపిక్కల్ని రెండు ముక్కలు చేసి వాటిని చీరాల ఎగుమతి చేస్తారు. అక్కడ వీటిని గుజ్జుగా మార్చివిదేశాలకు పంపుతారట.. ఆ గుజ్జుతో చాలా ప్రయోజనాలున్నాయి..

ఇది కుడా చూడండి : ఏ రోజు ఏ రంగు డ్రస్‌ వేసుకుంటే మంచిది

వీటిని రంగుల తయారీ లోను, వివిధ రకాల అట్టల తయారీ, జిగురు తయారీ, అలాగే మెడిసిన్స్ ఫ్యాక్టరీలకీ వీటిని ఎగుమతి చేస్తారట. ఇంకా చాలా ఉపయోగాలే వుండొచ్చు..

ఇది కుడా చూడండి : భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

మెట్టలో ఇంటింటీకీ చాలా మంది మహిళలు చింతపండు పిక్క తీస్తూ కనిపిస్తారు. ఇక్కడికి విశాఖ ఏజెన్సీ దగ్గర కావడంతో వ్యాపారులు చింతపండు తెచ్చి వీళ్ల చేత పిక్క తీయిస్తారు. కిలో చింతపండు పిక్క తీస్తే రూ.5 ఇస్తారు. ఇదండీ చింతపిక్క కథ.

ఇది కుడా చూడండి : పెద్దవారి పాదాలకు ఎందుకు నమస్కారం చెయ్యాలి

English summary

Tamarind Seeds For Sale