ఇళయరాజా మోసాన్ని బయటపెట్టిన నటి హేమ

Tamil actor Ilayaraja cheats actress Hemalatha

12:36 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Tamil actor Ilayaraja cheats actress Hemalatha

బాలీవుడ్ నటి జియాఖాన్ జీవితంలాగే తాజాగా ఒక తమిళ నటికి కూడా జరిగింది. అయితే ఆమె జియఖాన్ లా చనిపోలేదు. తనకి జరిగిన అన్యాయం కోసం పోరాడుతుంది. అసలు విషయంలోకి వస్తే తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఇళయారాజా అనే నటుడు తనను ప్రేమించి, పెళ్లి చేసుకుని మోసం చేసాడని తమిళ నటి, నిర్మాత హేమలత ఆరోపించారు. తనకి జరిగిన అన్యాయానికి న్యాయం చెయ్యమని చెన్నై పోలీసులని ఆశ్రయించిన ఫలితం లేకపోయింది. దీనితో ఆమె సినీ పరిశ్రమకి చెందిన కొంతమంది ప్రముఖలకి ఫిర్యాదు చేసిన వారు కూడా పట్టించుకోకపోవడంతో పాటు అతని పై ఎటువంటి చర్యలు  కూడా తీసుకోవడం లేదంటూ హేమ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇంక తనకి జరిగిన అన్యాయానికి మీడియా వారే సరైన దారి అని భావించిన హేమ మీడియాకు చెప్పుకోవడానికి నిన్న(శుక్రవారం) హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌ కు వచ్చారు. అక్కడ తనకి జరిగిన అన్యాయాన్ని వివరించారు. మా స్వస్థలం వరంగల్ జిల్లా, నర్సింహులపేట మండలం, పెద్దనగరం. సినిమాల్లో నటించాలనే ఆశతో హైదరాబాద్ వచ్చాను. అయితే తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో 2011లో చెన్నై వెళ్ళాను. అక్కడ అవకాశాలు కోసం వేటాడాను, ఆ తరువాత అవకాశం రావడంతో ఇప్పటి వరకు రెండు సినిమా ల్లో నటించాను. ఆ తరువాత నేనే నిర్మాతగా మారి రెండు సినిమా లని నిర్మించాను. అయితే 2014లో తమిళ నటుడు ఇళయారాజాతో నాకు పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయమే ప్రేమకి దారి తీసింది. ఇద్దరం రెండు సంవత్సరాలు కలిసి సహజీవనం చేశాం. 2015లో వాళ్ళ ఇంట్లోనే నన్ను పెళ్లి చేసుకున్నాడని హేమ తెలిపింది. ఈ విషయం ఇళయరాజా కుటుంబ సభ్యులకు, మా కుటుంబ సభ్యులకు తెలుసు. అయితే ఇళయారాజా కి అన్నయ్య ఉండడం వల్ల ఆ అన్నయ్య పెళ్లి అయిపోయాక మన ఇద్దరం అందరి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకుందామని చెప్పి నన్ను లోబర్చుకున్నాడు. ఆ తరువాత నాకు గర్భం వస్తే అబార్షన్ చేయించాడని కన్నీళ్ళు పెట్టుకుంది. మేమిద్దరం ఒకే ఇంటిలో కలిసి ఉంటున్నాం. అయితే 2015 సెప్టెంబర్ 3న మేము ఉంటున్న ఇంటి నుండి వెళ్లిన ఇళయారాజా తిరిగి రాలేదు.

దీనితో ఇళయరాజా గురించి ఆరా తీయగా అతనికి వేరే అమ్మాయితో పెళ్లి కుదిరిన విషయం తెలిసి తమిళనాడులోని మదురవాయిల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని కన్నీరు పర్యంతమైంది. నాకు జరిగిన అన్యాయానికి ఎలా అయినా న్యాయం జరిగేలా చూడలని, ఇళయరాజాకు మరో అమ్మాయితో పెళ్లి జరుగకుండా అడ్డుకోవాలని మీడియా ని కోరారు. 

1/4 Pages

వీడియో:

తనకి జరిగిన అన్యాయం గురించి మీడియా కి చెప్పుకుంటున్న హేమ

English summary

Tamil actor Ilayaraja cheats actress Hemalatha. Tamil actor Ilayaraja cheated Hemalatha and also bring pregnanancy to her.