'పవన్‌' చెల్లికి పెళ్లయింది!

Tamil Actress Sandhya got married on saturday in Guruvayaar

04:05 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Tamil Actress Sandhya got married on saturday in Guruvayaar

పవర్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటించిన 'అన్నవరం' చిత్రంలో పవర్‌స్టార్‌కి చెల్లెలుగా నటించిన సంధ్యకు ఇటీవలే పెళ్లయింది. తమిళ హీరో భరత్‌ తో నటించిన 'కాదల్‌' (ప్రేమిస్తే తెలుగులో) చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన సంధ్య, ఈ చిత్రం సూపర్‌హిట్‌ కావడంతో ఆ తరువాత జీవా, శింబు వంటి హీరోల సరసన నటించింది. ఆ తరువాత పవర్స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన అన్నవరం చిత్రంలో పవన్ కి చెల్లెలు గా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఆ తరువాత పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించిన సంధ్య ఆశించినంత విజయాలు రాకపోవడంతో ఇటీవలే చెన్నైకి చెందిన ఒక ఐటి స్పెషలిస్ట్‌ వెంకట చంద్రశేఖరన్‌ను శనివారం పెళ్లిచేసుకుంది.

అయితే చెన్నెలో ప్రస్తుతం వరదలు వల్ల ఇబ్బందులు ఉండడంతో గురువయార్‌ అనే ఊరిలో తన పెళ్లి చేసుకుని చెన్నై కి తిరిగి వచ్చింది. చెన్నైలో ఇంకా వర్షాలు తగ్గక పోవడంతో తన రిసెప్షన్‌ వేడుకను కేరళాలో చేయబోతున్నారు.

English summary

Tamil Actress Sandhya got married on saturday in Guruvayaar with IT specialist Venkata ChandraSekharan.