నేను బతికే వున్నాన్రోయ్

Tamil Comedian Senthil Death Rumors

03:05 PM ON 7th May, 2016 By Mirchi Vilas

Tamil Comedian Senthil Death Rumors

ఎవరికీ ఈ దుస్థితి రానే రాకూడదు...నేను బతికే వున్నానని చెప్పుకోవాల్సిన ఖర్మ పట్టింది ఈ కామిడీ హీరోకి...సోషల్ మీడియా వచ్చాక, పనీపాటా లేని ఆకతాయిలు..ఏం తోచక చేసే చెత్త ప్రచారాలు కొంతమందికి తీవ్ర ఆవేదన మిగులుస్తున్నాయి. కాస్త వయసు మళ్లిన సెలబ్రెటీని చూసుకుని..ఆ వ్యక్తి చనిపోయాడంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు సాగించడం ఈమధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. ముందు వెనకా చూసుకోకుండా మిగతా వాళ్లు కూడా అదే ప్రచారాన్ని కొనసాగించడం..జనాల్ని గందరగోళంలో పడేయడం..ఎక్కువగా చోటుచేసుకుంటున్న అంశం. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్య మన్న చందంగా వ్యవహారం నడుస్తోంది. ఇప్పటికే చాలామంది సెలబ్రెటీల్ని బతికుండగానే చంపేసిన సోషల్ మీడియా తాజాగా తమిళ గ్రేట్ కమెడియన్ సెంథిల్ ని కూడా అదే గాట కట్టేసింది.

ఇవి కూడా చదవండి:కాకతీయుల గురించి ఆసక్తికరమైన విషయాలు

ఇంతకీ విషయమేమంటే, 65 ఏళ్ల సెంథిల్ అనారోగ్యంతో చనిపోయారంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడవడంతో చాలా మంది అయ్యో పాపం అనుకున్నారు. ఆయన అభిమానులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఐతే ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, సెంథిల్ స్వయంగా ఓ ప్రకటన ఇచ్చాడు. తాను క్షేమంగా ఉన్నానని.. ఎలాంటి అనారోగ్యం లేదని క్లారిటీ ఇచ్చాడు. 80లు.. 90ల మధ్య గౌండర్ మణితో కలిసి తమిళ సినిమాల్ని సెంథిల్ ఏలాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఇద్దరూ కలిసి అద్భుతమైన కామెడీ పండించారు. డబ్బింగ్ సినిమాల ద్వారా సెంథిల్ తెలుగువాళ్లకూ పరిచయమే. అతడికి అప్పట్లో బాబూ మోహన్ డబ్బింగ్ చెప్పేవాడు. జెంటిల్మన్ లాంటి సినిమాల్లో అతను పండించిన కామెడీని మన ప్రేక్షకులు కూడా మరిచిపోలేరు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సెంథిల్.. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున ప్రచారం చేస్తున్నాడు. ఈలోగా దుష్ప్రచారం సాగడంతో ఖండన ప్రకటన ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి:సాక్ష్యం కోసం బాలిక ప్యాంట్ బటన్ విప్పించిన బిజెపి ఎంపి(వీడియో)

ఇవి కూడా చదవండి:పబ్లిక్ లో ఫ్యాన్ తో అక్కడ చెయ్యి వేయించుకున్న సన్నీ!

English summary

Recently a new going viral on Social media that Tamil Comedian Senthil was died. Comedian Senthil responds on this issue and he said that he was perfectly alright. Presently he was participating in Tamilnadu Elections.