సునీల్‌ సరసన తమిళ హీరోయిన్‌!

Tamil heroine is romancing with Sunil

01:19 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Tamil heroine is romancing with Sunil

కమీడియన్ నుండి కామెడీ హీరోగా, కామెడీ హీరో నుండి మాస్‌ హీరోగా ప్రమోట్‌ అయిన హీరో సునీల్‌. ప్రస్తుతం సునీల్‌ హీరోగా నటించిన 'కృష్ణాష్టమి' చిత్రం పోస్ట్‌ ప్రోడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 2016 జనవరి లో విడుదలయ్యే ఈ చిత్రానికి 'జోష్‌' ఫేమ్‌ వాసు వర్మ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా సునీల్‌ వంశీకృష్ణ ఆకెళ్ళ డైరక్షన్‌లో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండూ కాకుండా సునీల్‌ వీరూ పోట్ల దర్శకత్వంలో 'ఈడు గోల్డ్‌ ఎహే' అనే సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు హరోయిన్స్‌తో సునీల్‌ రొమాన్స్‌ చేయబోతున్నాడు.

ఇందులో మొదటి హీరోయిన్‌గా 'జోరు' ఫేమ్‌ సుష్మా రాజ్‌ ఎంపికైంది. ఇంకో హీరోయిన్‌ను ఎంపిక చెయ్యాల్సి ఉంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్‌ పతాకం పై రామబ్రహ్మం సుంకర నిర్మించబోతున్న ఈ చిత్రం జనవరి చివర్లో సెట్స్‌ పైకి వెళ్లనుంది.


English summary

Tamil heroine Sushma Raj is romancing with Sunil in Eedu Gold Ehe movie. Veeru Potla is directing this movie.